Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు పాజిటివ్‌..

ప్రపంచ దేశాలతో పాటు భారత దేశంలోనూ కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షను దాటేశాయి. ఈక్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు పాజిటివ్‌..
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది.
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2022 | 7:24 AM

ప్రపంచ దేశాలతో పాటు భారత దేశంలోనూ కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షను దాటేశాయి. ఈక్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీలు ఒక్కొక్కరూ కరోనాకు గురవుతున్నారు. తాజాగా తనకు కరోనా సోకినట్లు స్టార్‌ హీరోయిన్‌ త్రిష వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించాను. అయినా కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్ది రోజుల ముందే కొవిడ్‌ పాజిటివ్‌గా నాకు నిర్ధారణ అయింది. ప్రస్తుతం కొవిడ్‌ లక్షణాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మహమ్మరి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. ఈ సందర్భంగా నా క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు ‘ అని ట్వి్ట్టర్‌లో పేర్కొంది త్రిష.

టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని సినిమా పరిశ్రమలను పట్టి పీడిస్తోంది కరోనా. నిన్న (జనవరి6) స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, అంతకు ముందు ప్రిన్స్‌ మహేష్‌ బాబు కరోనా బాధితుల జాబితాలో చేరారు. మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విశ్వక్‌ సేన్‌తో పాటు తమిళ సినీ పరిశ్రమలో అరుణ్‌ విజయ్‌, వడివేలు, విక్రమ్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌ తదితరులు కూడా కరోనా కోరలకు చిక్కిన సంగతి తెలిసిందే.

Also Read:

ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్

MS Dhoni: మళ్లీ అభిమానుల మనసు గెల్చుకున్న ఎం.ఎస్‌.ధోని.. పాక్‌ క్రికెటర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన టీమిండియా మాజీ కెప్టెన్‌..

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24 గంటల్లో ఏకంగా..