AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24 గంటల్లో ఏకంగా..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24 గంటల్లో ఏకంగా..
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 9:08 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. చాలారోజుల తర్వాత తెలంగాణలో రోజువారీ కేసులు 2వేల మార్కును దాటాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 64,744 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,295 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. కాగా తాజాగా వైరస్‌ బారిన పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,039కి చేరింది. ఇక కరోనా నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్‌ కేసులున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికం.. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఆతర్వాత మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 232 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 218, హనుమకొండ 54, సంగారెడ్డి 50, నిజామాబాద్‌, ఖమ్మంలో 29 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోల్చితే దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా కరోనా పరీక్షలు నిర్వహించిన కేసుల్లో ఇంకా 10, 336 మందికి చేసిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Also read:

AUS VS ENG: ఆస్ట్రేలియా బౌలర్లను ఆటాడుకున్న జానీ బెయిర్‌ స్టో.. అయినా ఇంకా ఆధిక్యంలోనే ఆసీస్‌..

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌