AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS VS ENG: ఆస్ట్రేలియా బౌలర్లను ఆటాడుకున్న జానీ బెయిర్‌ స్టో.. అయినా ఇంకా ఆధిక్యంలోనే ఆసీస్‌..

యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఆసీస్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. 36 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు.

AUS VS ENG: ఆస్ట్రేలియా బౌలర్లను ఆటాడుకున్న జానీ బెయిర్‌ స్టో.. అయినా ఇంకా ఆధిక్యంలోనే ఆసీస్‌..
Jonny Bairstow
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 8:40 PM

Share

యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఆసీస్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. 36 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే సిరీస్‌లో మొదటిసారి ఆసీస్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాడు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టో. బుల్లెట్లలా దూసుకొస్తున్న ఆసీస్‌ బౌలర్ల బంతులను పట్టుదలతో ఎదుర్కొన్నాడు. 140 బంతులను ఎదుర్కొని 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 బౌండరీలు, ఒక సిక్స్‌ ఉన్నాయి. కాగా యాషెస్‌ సిరీస్ లో ఇంగ్లండ్ తరఫున నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం.

కాగా గత కొద్దికాలంగా వరుసగా విఫలమవుతోన్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు. 66 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టును ఆదుకున్నాడు. మార్క్‌వుడ్‌ (39) కూడా బ్యాట్‌తో రాణించగా బట్లర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బెయిర్‌ స్టో- బెన్‌ స్టోక్స్‌ల పుణ్యమా అని మూడో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. కాగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో శుక్రవారం కేవలం 65 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్‌(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్‌, గ్రీన్‌, లియాన్‌ చెరో వికెట్‌ సాధించారు.

Also Read:

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..