AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్‌ ఫోన్‌ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు.

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..
Tihar Jail
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 5:44 PM

Share

ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్‌ ఫోన్‌ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. అయితే ఖైదీ దగ్గర మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు, రోజూ కాల్స్‌ చేసి మాట్లాడుతున్నాడని జైలు అధికారులకు తెలిసిపోయింది. ఆ ఖైదీపై నిఘా పెట్టారు. అతని దగ్గర ఫోన్‌ ఉందని నిర్ధారణ చేసుకున్నారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ఖైదీ ఉన్న బ్యారక్‌ దగ్గరకు వెళ్లారు. అయితే జైలు అధికారులు వస్తున్నారన్న విషయం ఖైదీకి తెలిసిపోయింది. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర భయాందోళన మధ్య మొబైల్‌ ఫోన్‌ను మింగేశాడు. ఢిల్లీలోని తిహార్‌ జైలులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు.

ఇంకా ఖైదీ కడుపులోనే ఫోన్‌.. కాగా ఫోన్‌ మింగిన ఖైదీని చికిత్స నిమిత్తం వెంటనే దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కాగా మొబైల్‌ ఫోన్‌ ఇంకా ఖైదీ కడుపులోనే ఉందని, దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Also Read:

Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Kurnool: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫుడ్‌ ఫాయిజన్‌.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!