అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఏటా పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన శబరిమలకు వెళుతుంటారు. అలా ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరారు. అయితే నియమనిష్టాలతో కాలినడకన శబరిమల యాత్ర  అంటే అనుకున్నంత

Basha Shek

|

Jan 07, 2022 | 4:44 PM

అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఏటా పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన శబరిమలకు వెళుతుంటారు. అలా ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరారు. అయితే నియమనిష్టాలతో కాలినడకన శబరిమల యాత్ర  అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు ఎంతో ఓర్పు, సహనం ఉండాల్సిందే. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలు దేరారు. ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. భక్తి భావంతో బెంగళూరు నుంచి మొదలైన ఈ అన్నాచెల్లెళ్లు సుమారు 580 కిలోమీటర్ల పాటు ప్రయాణించి కేరళలోని శబరిమలకు చేరుకోనున్నారు.

అయ్యప్ప ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలి.. ఈ క్రమంలో కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్న ఈ చిన్నారుల పట్టుదల, ధైర్యానికి, భక్తికి, ఓర్పుని చూసి రోడ్డుపై జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారులకు నమస్కారం చేస్తూ తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. కాగా ఈ అన్నాచెల్లెళ్ల యాత్రకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘ఈచిన్నారులపై అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలి. వీరు క్షేమంగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి’ అని కోరుతున్నారు.

Also read:

Kurnool: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫుడ్‌ ఫాయిజన్‌.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..

Hyderabad: మరణంలోనూ వీడని స్నేహం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు స్నేహితుల మృతి..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu