AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరణంలోనూ వీడని స్నేహం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు స్నేహితుల మృతి..

వారిద్దరూ బాల్యం నుంచి ప్రాణ స్నేహితులు. కష్టమొస్తే ఒకరికొకరు తోడుగా నిలిచారు. సంతోషమొస్తే కలిసి పంచుకున్నారు. కానీ చివరకు చావును కూడా కలిపే

Hyderabad: మరణంలోనూ వీడని స్నేహం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు స్నేహితుల మృతి..
Road Accident
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 3:20 PM

Share

వారిద్దరూ బాల్యం నుంచి ప్రాణ స్నేహితులు. కష్టమొస్తే ఒకరికొకరు తోడుగా నిలిచారు. సంతోషమొస్తే కలిసి పంచుకున్నారు. కానీ చివరకు చావును కూడా కలిపే పంచుకున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు స్నేహితులు మరణించారు. హైదరాబాద్ పరిధిలోని షాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మరణించినట్లు శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణ గుట్టకు చెందిన కె.ప్రభాకర్‌ (38), అక్బర్‌ (32) బాల్యం నుంచి మిత్రులు. ప్రభాకర్‌ బియ్యం వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అక్బర్‌ టైలరింగ్‌ చేసేవాడు.

ఈ క్రమంలో గురువారం ప్రభాకర్‌ తన స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌కు అక్బర్‌ను బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం అక్కడినుంచి తిరిగి పెద్దషాపూర్‌ వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలుండగా.. అక్బర్‌కు ఇంకా వివాహం కాలేదని శంషాబాద్‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Vanama Raghava: TRS నుంచి వనమా రాఘవ సస్పెండ్.. సీఎం కేసీఆర్ ఆదేశాలు