Vanama Raghava: TRS నుంచి వనమా రాఘవ సస్పెండ్.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
టీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో వనమా రాఘవను పార్టీ సస్పెండ్ చేసింది
టీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో వనమా రాఘవను పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవపై వేటు వేశారు. మరోవైపు రాఘవ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతోంది.
గురువారం రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు- లేఖ రాశాక పోలీసులకు చిక్కాడని ప్రచారం జరిగింది. ఇవాళ చూస్తే పోలీసులు ఇంటికి నోటీసులు అంటించారు. మధ్యాహ్నం పన్నెండున్నరకల్లా.. లొంగిపోవాలన్నారు. కానీ వనమా జాడ ఇంత వరకూ దొరకనే లేదు. ఇంతకీ రాఘవ విశాఖలో ఉన్నట్టా? రాజమండ్రిలోనా? లేక హైదరాబాద్ లోనే ఉన్నాడా? లేక మరేదైనా చోటుకు పారిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.
అసలు వివాదం ఏంటంటే..?
ఏడాదిగా రామకృష్ణ కుటుంబంలో ఉమ్మడి ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ విషయంలో రామకృష్ణ తల్లి సూర్యావతి వనమా రాఘవను కలిసింది. ఉమ్మడి ఆస్తిని అమ్మగా వచ్చిన సొమ్మును- ముగ్గురూ కలసి పంచుకోండి. అదే సమయంలో ఒక కొడుకుగా తల్లిని చూస్కోవల్సిన బాధ్యత రామకృష్ణదే అని రాఘవ తీర్పిచ్చాడు. ఈ తీర్పు తనకు అనుకూలంగా లేదని రామకృష్ణ వాపోయాడు. అయితే నీ భార్యను ఒంటరిగా హైదరాబాద్ పంపమని రాఘవ.. రామకృష్ణకు హుకుం జారీ చేశాడన్నది ఆరోపణ. ఇదే విషయాన్ని సెల్ఫీ వీడియోలో వివరించాడు రామకృష్ణ. ముప్పై ఏళ్ల పరిచయమున్న కుటుంబంతో ఇలాగేనా బిహేవ్ చేసేది. ఇదీ ఈ చుట్టుపక్కల వాళ్లు అంటోన్న మాట.
ఇక వనమా రాఘవ క్రైమ్ హిస్టరీ చూస్తే.. 92 నాటి నుంచే- క్రైమ్ హిస్టరీ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. రాఘవ వ్యవహార శైలి కారణంగా ఒక ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడంటే.. సీనేంటో ఊహించుకోవచ్చు. ఇక రాఘవపై 2006లో తొలిసారి అధికారికంగా కేసు నమోదయ్యింది. తర్వాత 2013- 2017- 2020-2021- 2022 .. ఇలా వరుస సంవత్సరాల్లో వరుస కేసులు నమోదయ్యాయి.
ఆ మాటకొస్తే పాల్వంచ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాఘవపై భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంగుళం భూమి కనిపించినా వదలడనీ- ఆడ గాలి తగిలిందంటే విడిచిపెట్టడనీ- అధికారులంటే లెక్కే లేదనీ టాక్. మామూలు మనుషులే కాదు- పోలీసులూ ఇతడి కారణంగా సూసైడ్ చేస్కున్నారని చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని ఎన్నెన్నో ఆగడాలు సృష్టించాడనీ అంటున్నారు.
Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..