AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

ఏ క్రైమ్‌ వెనుక రీజన్ వెతికినా.. చివరికి అదే లీడ్ దొరుకుతుంది. ఏ గొడవకు కారణం వెతికినా అదే అని తేలుతుంది. యస్.. అక్రమ సబంధాలు, వివాహేతర సంబంధాలు

Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..
Suryapet Murder
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2022 | 4:26 PM

Share

ఏ క్రైమ్‌ వెనుక రీజన్ వెతికినా.. చివరికి అదే లీడ్ దొరుకుతుంది. ఏ గొడవకు కారణం వెతికినా అదే అని తేలుతుంది. యస్.. అక్రమ సబంధాలు, వివాహేతర సంబంధాలు.. హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆత్మహత్యల దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఈ రెండు, మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటనలు చాలా వెలుగుచూశాయి. తాజాగా  తన భార్యతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడనే అనుమానంతో.. ఓ యువకుడిని దమ్ము చక్రాలతో తొక్కించి దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. తెలంగాణ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లక్కవరంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేశ్‌(30) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై.. ఇరువురి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. నాలుగేళ్ల క్రితం పెద్దమనుషులు వరకు వెళ్లింది పంచాయతీ. అప్పుడు ఆమె జోలికి వెళ్లినని మాట ఇచ్చాడు మహేశ్. కానీ కొన్నాళ్లుకు మళ్లీ అదే రూట్‌లో పయనించాడు. కాగా మంగళవారం గూబగుట్టకు వెళ్లే దారిలో పొలంలో నాట్లు వేసే పనిని వెళ్లాడు మహేశ్‌. నాట్లు ముగిసిన తర్వాత.. బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో పొలాన్ని దమ్ము చేసి ఆ దారిలోనే వస్తున్న సదరు ట్రాక్టర్ డ్రైవర్‌కు.. ఒంటరిగా వెళ్తున్న మహేశ్‌ కంటపడ్డాడు. దీంతో.. పాత పగ గుర్తు తెచ్చుకొని.. వేగంగా ట్రాక్టర్‌తో వెళ్లి మహేశ్‌ బైక్‌ను ఢీకొట్టాడు.

దీంతో.. బైక్‌తో సహా దారి పక్కనున్న పొలం మడిలో పడిపోయాడు మహేశ్‌. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అంతటితో ఆగలేదు. ట్రాక్టర్‌ను పొలంలోకి దించి.. అతనిపై నుంచి తొక్కించడంతో మహేశ్‌ స్పాట్‌లోనే మరణించాడు. అనంతరం.. సదరు ట్రాక్టర్‌ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana: వారికి సెలవలు రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. నేటి నుంచే అమల్లోకి

అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్