Telangana: వారికి సెలవలు రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. నేటి నుంచే అమల్లోకి
కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. థర్డ్ వేవ్ ప్రారంభమైంది. లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ విజృంభిస్తోంది.
కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. థర్డ్ వేవ్ ప్రారంభమైంది. లక్షకు చేరువలో రోజవారి కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య ఊహించని విధంగా పెరుగుతూ వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే 4 వారాలు ఎలాంటి సెలవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని వెల్లడించారు. వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ వైద్యారోగ్యశాఖ పలు సూచనలు చేస్తోందని.. వాటిని పాటించాలని డీహెచ్ సూచించారు.
కరోనా ప్రమాదకరంగా వ్యాప్తిస్తోన్న నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ సూచనలు
- తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్కు ధరించాలి
- భౌతికదూరం పాటించాలని కోరుతున్నాం
- వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి
- గాలి బాగా తగిలే ప్రదేశాల్లో ఉండాలి
- వ్యాధి సింటమ్స్ ఉన్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలి
- లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి
- తక్కువ లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్‌లో ఉండాలి
- పబ్లిక్ గేథరింగ్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండండి
- పిల్లలు, వృద్ధులు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
- ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి
Also Read: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ మీటింగ్.. PRCపై ఆ రోజున తుది ప్రకటన
అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్