E-Governance 2022: హైదరాబాద్ వేదికగా ఇ-గవర్నెన్స్ 2022.. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 7, 8 తేదీల్లో జాతీయ సదస్సు

24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది.

E-Governance 2022: హైదరాబాద్ వేదికగా ఇ-గవర్నెన్స్ 2022.. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 7, 8 తేదీల్లో జాతీయ సదస్సు
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2022 | 4:00 PM

E-Governance 2022 at Hyderabad: 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ థీమ్ ‘ఇండియాస్ టెకేడ్: డిజిటల్ గవర్నెన్స్ ఇన్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్‌.’గా నిర్ణయించారు

ప్రారంభ సెషన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సులో ఆత్మ నిర్భర్ భారత్, పబ్లిక్ సర్వీసెస్ యూనివర్సలైజేషన్, ఇన్నోవేషన్ – ప్లాట్‌ఫార్మైజేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండియాస్ టెకేడ్ – డిజిటల్ ఎకానమీ (డిజిటల్ పేమెంట్స్ – బిల్డింగ్ సిటిజన్స్ కాన్ఫిడెన్స్) వంటి పలు అంశాలపై స్పీకర్ సెషన్‌లు కూడా ఉంటాయి.

కాన్ఫరెన్స్ మొదటి రోజున (జనవరి 7న) నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్- 2021 ప్రధానం చేయడం జరుగుతుంది. ఇ-గవర్నెన్స్‌పై నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల ప్రభావవంతమైన అమలును గుర్తించడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలోని ఉన్నతాధికారులు, ఇ-గవర్నెన్స్‌ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం తో పాటు ఇ-గవర్నెన్స్ లో ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తారు.ఈ వేదిక ద్వారా ఇస్తున్న అవార్డులు ఇ-గవర్నెన్స్ మరియు డిజిటలైజేషన్‌ రంగాల్లో కృషి చేస్తున్న వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి.

రెండు రోజులు జరిగే ఈ సదస్సులో, నిర్ధారించిన థీమ్‌లు మరియు సబ్-థీమ్స్ లపై పలు సెషన్స్ తో పాటు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారుల తో పాటు ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సు లో పాల్గొంటారు.

Read Also….  GHMC on Covid 19: థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం.. సర్కిళ్ల వారీగా ఐసోలేషన కేంద్రాలుః గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి