CM Jagan: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ మీటింగ్.. PRCపై ఆ రోజున తుది ప్రకటన

PRC పంచాయితీ క్లైమాక్స్‌కు చేరింది. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను CM జగన్‌ నోట్‌ చేసుకున్నారు. అంతా సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు CM జగన్.

CM Jagan: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ మీటింగ్.. PRCపై ఆ రోజున తుది ప్రకటన
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2022 | 3:39 PM

PRC పంచాయితీ క్లైమాక్స్‌కు చేరింది. 2, 3 రోజుల్లో ప్రకటన చేస్తామని CM జగన్ ప్రకటించారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో తాడేపల్లిలోని క్యాంప్‌ఆఫీస్‌లో సమావేశమయ్యారు జగన్. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని …. మనసా, వాచా మంచి చేయాలనే తపనతోనే ఉన్నాని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. 2, 3 రోజుల తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు జగన్. ఆ మీటింగ్‌లోనే PRCపై తుది ప్రకటన చేస్తారు.

ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను CM జగన్‌ నోట్‌ చేసుకున్నారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని చెప్పారు. వీలైనంతగా మంచి చేయాలన్న తపనతో ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు జగన్. ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా… అందరూ కాస్త ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతా సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు CM జగన్.

గత 2 నెలులుగా PRC పంచాయితీ నడుస్తోంది. అశుతోష్‌ మిశ్రా నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. పలుమార్లు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినా లాభం లేకపోయింది. దీంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి. ఆ తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా JACలతో చర్చలు జరిపారు. ఈలోపే సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. 14.29 ఫిట్‌మెంట్ ఇవ్వాలని సూచించింది. కానీ దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తుంటే…ఫిట్‌మెంట్‌ని 14.29గా ఎలా సూచిస్తారంటూ మండిపడ్డాయి. ఆ తర్వాత కూడా పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ప్రభుత్వం.

ఫైనల్‌గా 40 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత ఇవ్వడం సాధ్యం కాదంటోంది ప్రభుత్వం. 14 నుంచి 27 శాతం మధ్యలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది..

Also Read: ఫ్యామిలీ సూసైడ్ విషయంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..

అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్