AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating: చిన్న లింక్‌కు చిక్కిన ఊరు.. ఇప్పుడేమో కన్నీరు.. కోటిన్నర సమర్పయామి..

దగుల్బాజీ యాప్‌ల ఇస్మార్ట్‌ చీటింగ్‌కి వికారాబాద్‌ జిల్లా కడ్మూర్‌ పల్లె ఘోల్లుమంటోంది. రీఛార్జ్‌ చేయండి మీరు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు విత్‌ డ్రా చేసుకోండన్న ఆఫర్‌కి టెమ్ట్ అయ్యి నిండా మునిగిపోయారు.

Cheating: చిన్న లింక్‌కు చిక్కిన ఊరు.. ఇప్పుడేమో కన్నీరు.. కోటిన్నర సమర్పయామి..
Chber Cheating
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2022 | 3:30 PM

Share

దగుల్బాజీ యాప్‌ల ఇస్మార్ట్‌ చీటింగ్‌కి వికారాబాద్‌ జిల్లా కడ్మూర్‌ పల్లె ఘోల్లుమంటోంది. రీఛార్జ్‌ చేయండి మీరు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు విత్‌ డ్రా చేసుకోండన్న ఆఫర్‌కి ఒకరిద్దరు కాదు ఊరు ఊరంతా టెంప్ట్ అయింది. కోటిన్నర పొగొట్టుకుని తల పట్టుకుంది. చూడ్డానికి పల్లెనే.. కానీ అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు. ఓ ఫైన్‌డే లైమ్ యాప్‌ పేరుతో లింక్‌ వచ్చింది. అది క్లిక్‌ చేస్తే లైమ్ యాప్‌ డౌన్‌లోడ్‌తో పాటు వాట్సప్‌ కనెక్ట్ అయింది. రూపాయి రిఛార్జ్‌ చేయండి.. నాలుగు రూపాయలు పొందండన్నది ఆ యాప్‌ సారాంశం. మొదట్లో టైమ్‌ ప్రకారం అమౌంట్‌ రావడంతో ఒకర్ని చూసి మరొకరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఓ అందమైన బొమ్మ పేరు సీమ త్రివేది సీన్‌లోకి వచ్చింది. వాట్సప్ డీపీలో ఫోటో పెట్టి వరుసగా అందర్నీ ఫ్లాట్ చేసింది. కుదిరితే మెసేజ్‌ లేదంటే కాల్‌ చేసి అట్రాక్ట్ చేసింది. పెట్టుబడి పెట్టండి.. అంతకుమించి సొమ్ము వచ్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చింది. కిలేడి మాటలు నిజమని నమ్మిన చాలామంది గుడ్డిగా పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. చివరకు మోసపోయామని గుండెలు బాదుకుంటున్నారు.

Cyber Cheating

Seema

సీమ బొమ్మతో ఫిదా అయిన జనానికి.. ఆమె పంపిన మెసేజ్‌లతో దిమ్మతిరిగినంత పనైపోయింది. మీ డబ్బులు రావాలంటే మీకు కంపెనీ పంపిన దాంట్లో 10శాతం వాటా తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే ఇన్‌కంటాక్స్‌ రైడ్స్ జరుగుతాయని బెదిరింపులకి దిగింది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే ఇప్పుడీ తిప్పలేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కడ్మూర్‌లో ఎక్కడ చూసిన సైబర్ చీటింగ్‌ వ్యవహరం ముచ్చటే. ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ చీటింగ్‌పై అలర్టయిన పోలీసులు.. అసలు ప్రైవేట్‌ లింక్స్‌ ఓపెన్‌ చేయొద్దని సజెస్ట్ చేస్తున్నారు.ప్రైవేట్‌ యాప్స్‌లో పెట్టుబడి పెట్టొద్దని.. ఒకవేళ ఆశపడి పెడితే మోసపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..