Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..
4Gని దాటుకొని 5Gలోకి అడుగుపెడుతున్నాం. ఆకాశంలోకి ఎగిరి చందమామను కూడా అందుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. కరోనా మహమ్మారి లాంటి వైరస్‌లకు చెక్
4Gని దాటుకొని 5Gలోకి అడుగుపెడుతున్నాం. ఆకాశంలోకి ఎగిరి చందమామను కూడా అందుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. కరోనా మహమ్మారి లాంటి వైరస్‌లకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లను కూడా కనుగొంటున్నాం. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందుతున్నా.. ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను వదలడం లేదు. జ్యోతిష్కులు చెప్పే వెర్రి సూచనలతో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణే తమినాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన. మూఢనమ్మకాలతో కన్న కూతురిని తన చేతులారా చంపుకుంది ఓ అమాయక తల్లి. అంతటితో ఆగక.. ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కూతురికి విషమిచ్చి.. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్ జిల్లా తుడియలూర్కు సమీపంలోని అప్పనయక్కంపలయమ్ గ్రామానికి చెందిన ధనలక్ష్మి(58) అనే మహిళకు దివ్యాంగురాలైన కుమార్తె సున్య(30), కుమారుడు శశికుమార్ ఉన్నారు. శశికుమార్ వివాహం చేసుకుని సరవనంపట్టిలో వేరు కాపురం పెట్టారు. అయితే ధనలక్ష్మికి జ్యోతిష్యమన్నా, వారు చెప్పే మాటలన్నా అపార నమ్మకం. ఆ నమ్మకమే ధనలక్ష్మి, తన కూతురు పాలిట శాపంగా మారాయి. ఈమధ్యకాలంలో స్థానిక జ్యోతిష్కుడిని కలిసిన ధనలక్ష్మి తన జాతకం చూపించుకుంది. ‘ నీ జాతకం అసలు బాగోలేదని.. త్వరలోనే అనారోగ్యం పాలవుతావు’ అని ఆమెను నమ్మించాడు జ్యోతిష్యుడు. అంతటితో ఆగక తన కాళ్లు, చేతులు పడిపోతాయని ధనలక్ష్మిని భయపెట్టాడు. అతని మాటలు మైండ్ కు ఎక్కించుకున్న ధనలక్ష్మి తీవ్రంగా ఆలోచించింది. తనతో పాటు మతిస్థిమితం లేని తన కూతురి భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించ సాగింది. తాను మంచాన పడితే.. అన్నీ తానై చూసుకుంటున్న తన కూతురు సుకన్య బాగోగులు చూసేవాళ్లు ఎవ్వరూ ఉండరని మానసికంగా ఆందోళనకు గురైంది. కుమారుడు శశికుమార్‌కు కూడా తన ఆవేదన చెప్పుకుని బాధపడింది. తల్లి మాటలతో ఆందోళన చెందిన శశికుమార్.. అలాంటివేం జరగదని ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
వాటిని నమ్మవద్దు..
కుమారుడు అంత భరోసా ఇచ్చాక కూడా ధనలక్ష్మి మనసు కుదుటపడలేదు. తీవ్ర భయాందోళనలో ఓ అమాయక నిర్ణయం తీసుకుంది. మతిస్థిమితం లేని కూతురికి విషమిచ్చి చంపింది. ఆపై తాను ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కాగా ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తల్లి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్న శశికుమార్ ఫోన్‌చేశాడు. కానీ ధనలక్ష్మి ఫోన్ ఎత్తలేదు. దీంతో వెంటనే పొరుగింటి వారికి ఫోన్ చేసి.. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడమని అభ్యర్థించాడు శశి.. వారు వెళ్లి ఇంట్లోకి చూడగానే ధనలక్ష్మి ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వారు కుమారుడికి అందజేశారు. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు శశి. అక్కడ తల్లి ఉరి వేసుకుని, సోదరి సుకన్య నోటిలో నురగలతో విగతజీవులుగా కనిపించారు. తన తల్లి, సోదరి మరణానికి జ్యోతిష్యుడు కారణమని విషయం తెలుసుకున్న కొడుకు శశికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. కుటుంబ సభ్యుల మృతికి జ్యోతిష్కుడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలిసులు. జ్యోతిష్కుల గాలి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపొద్దని.. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. Also Read:
Kurnool: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫుడ్ ఫాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..
SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు పాజిటివ్..