AP: పోలీస్ స్టేషన్​‌లో సీజ్ చేసిన 2 బైక్స్ మిస్సింగ్.. విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్

ఈ మధ్య నేరగాల్లు రూట్ మార్చారు. టెక్నాలజీ పెరగడంతో.. వారు కూడా దొరక్కుండా ఉండేందుకు కొత్త రూట్లు ఎన్నుకుంటారు.

AP: పోలీస్ స్టేషన్​‌లో సీజ్ చేసిన 2 బైక్స్ మిస్సింగ్.. విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్
Bikes Theft
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2022 | 5:37 PM

ఈ మధ్య నేరగాల్లు రూట్ మార్చారు. టెక్నాలజీ పెరగడంతో.. వారు కూడా దొరక్కుండా ఉండేందుకు కొత్త రూట్లు ఎన్నుకుంటారు. వినూత్న పంథాలో క్రైమ్స్ చేస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్నాడు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి పోలీసులకు ఓ కన్నింగ్ కిలాడీ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో రెండు బైకులు చోరికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ దొంగతనం చేసింది.. లాయర్ కోటు వేసుకున్న దొంగ.

గతంలో పాత నేరస్థుడైన రమణి రాజేంద్ర కుమార్ (31) వ్యక్తి ట్రాక్ మార్చాడు. నెల్లూరులోని జవాహర్ రెడ్డి కాలనీలో నకిలీ లాయర్​గా అవతారమెత్తాడు. పలువురు సీనియర్ లాయర్ల దగ్గర పనిచేస్తూ.. పోలీస్ స్టేషన్​కు వస్తూ.. పోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే.. పోలీస్ స్టేషన్‌లోని బైక్స్‌పై అతని కన్ను పడింది. ఎంత అనుభవం ఉందో తెలియదు కానీ… స్టేషన్​లోని బైక్స్‌ని పోలీసులకు తెలియకుండా చోరీ చేశాడు. గతంలో సీజ్ చేసి స్టేషన్లో పెట్టిన TS 08 FW 3605 టీవీఎస్ జూపిటర్, AP 26 AT 7927 యమహా బైక్​లను దొంగలించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తు చేపట్టి రాజేంద్ర కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 1.40 లక్షల విలువైన రెండు బైకులను స్వాధీనం చేసుకుని.. రిమాండ్​కు తరలించారు.

Bikes Theft