Hyderabad: ముంబయి డ్రగ్స్‌ ముఠాల గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు.. పలువురు అరెస్ట్‌.. భారీ మొత్తంలో మత్తు పదార్థాల స్వాధీనం..

Hyderabad: ముంబయి డ్రగ్స్‌ ముఠాల గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు.. పలువురు అరెస్ట్‌.. భారీ మొత్తంలో మత్తు పదార్థాల స్వాధీనం..

ముంబయి కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా హైదరాబాద్‌లో బట్టబయలైంది. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా మూడు ముఠాలకు చెక్‌ పెట్టారు.

Basha Shek

|

Jan 07, 2022 | 6:54 PM

ముంబయి కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా హైదరాబాద్‌లో బట్టబయలైంది. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా మూడు ముఠాలకు చెక్‌ పెట్టారు. ఏడుగురు నిందితులను పట్టుకొని.. లక్షల విలువ చేసే డ్రగ్స్‌ని సీజ్‌ చేశారు. భాగ్యనగరంలో డ్రగ్స్ మాఫియా ఆగడాలు మరోసారి బట్టబయలయ్యాయి. పోలీసులు ఎన్ని సార్లు దాడులు జరిపినా డ్రగ్స్‌ దందా రాయుళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ఏజెంట్లను నియమించుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఒక్కప్పుడు ముంబయి లాంటి మహానగరాల్లో మాత్రమే విస్తరించిన ఈ డర్టీ కల్చర్‌కు ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుకున్నారు. జోష్ అంటూ కుర్రకారును, యువతను టార్గెట్‌గా చేసుకొని మత్తులో మునిగిపోయేలా చేస్తున్నారు. కాగా న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకొని ముఠాలు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు డంప్ చేశాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ముఠాలను పట్టుకొనేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. మూడు డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రైవేటు లాడ్జీల్లో..

విచారణలో ముంబయి కేంద్రంగా ఈ ముఠా దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తుందని తేలింది. ఈ కేసులో నైజీరియా దేశానికి చెందిన టోనీ కింగ్ పిన్‌గా ఉన్నాడు. అయితే టోనీ ఒక్కొక్క రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు నియమించుకొని ఆయా రాష్ట్రాల ఏజెంట్లు ద్వారా.. డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఎలాంటి అనుమానం రాని ఓయో రూమ్స్‌ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందాను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ముంబయికి చెందిన ఇమ్రాన్ బాబు షేక్, నూర్ మహమ్మద్ ఖాన్‌ను ఓయో లాడ్జీలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8.30 లక్షలు విలువ చేసే 83 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ ఘాట్‌లోనూ డ్రగ్స్‌ ముఠాకు చెందిన సయ్యద్ ఖైసర్ హుసేన్, సయ్యద్ రషీద్ హమ్మద్ ఖాన్, నజబుల్ హాసన్ షేక్‌లు దొరికి పోయారు. వీరి నుంచి దాదాపు రూ.6 లక్షల విలువ చేసే కొకైన్‌, MDMAను స్వాధీనం చేసుకున్నారు. మరో ముఠా నుంచి LSD డ్రగ్‌ 17 స్ట్రిప్స్‌, 27 స్తిఫ్స్‌ను సీజ్‌ చేశారు.

ఇకపై వారి కూడా కఠిన చర్యలు..

కాగా ఇంత కాలం కేవలం డ్రగ్స్ అమ్మకాలు, సరఫరా చేసిన వారిపైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనే వారు. అయితే హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక నుంచి డ్రగ్స్‌ తీసుకునే వారిపై సెక్షన్‌ 27 కింద జైల్‌కు పంపుతామని వార్నింగ్‌ ఇస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి పదేపదే కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలితే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన కింగ్ పిన్ టోనీని పట్టుకొనేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామమన్నారు సీపీ సీవీ ఆనంద్‌. ముంబయి పోలీసులకు, సెంట్రల్ ఏజెన్సీలకు లేఖ రాసి త్వరలోనే అతడిని పట్టుకుంటామన్నారు.

Also Read:

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu