AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..

టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.చిన్న సినిమాలు పెద్ద సినిమాలను ప్రోత్సహిస్తూ..

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..
Sp
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2022 | 8:09 PM

Share

Suresh Productions: టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.చిన్న సినిమాలు పెద్ద సినిమాలను ప్రోత్సహిస్తూ.. దూసుకుపోతుంది సురేష్ ప్రొడక్షన్స్. రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యానర్ లో కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా ఇంకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్‌ లైన్ అప్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏసియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది.

శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సై ఫై థ్రిల్లర్‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలైంది. 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. మానాడును మిగతా భాషల్లో సురేష్ ప్రొడక్షన్ రీమేక్ చేయనుంది. దానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మన్నాడు సినిమాను దగ్గుబాటి హీరో రానా రీమేక్ చేయనున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయం పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

Follow Us
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు