Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదుంది. తెలుగు , తమిళ్ సినిమాలతో పాటు హిందీలో సత్తా చాటుతుంది ఈ వయ్యారి భామ

Samantha's Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2022 | 3:55 PM

Samantha’s Yashoda: టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలో సత్తా చాటుతుంది ఈ వయ్యారి భామ. ఇక తెలుగులో ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమా హిస్టారికల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే యశోద అనే సినిమాలోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే మొదటి షడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టింది. గురువారం(జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టింది చిత్రయూనిట్. అలాగే  సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుందని. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం  అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సినిమా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర పాత్రల్లో.. సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Hyderabad: సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మల్టిప్లెక్స్ థియేటర్లలో తగ్గిన సినిమా టికెట్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..