AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తాజాగా ఈ కుర్ర హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..
Shesh
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2022 | 3:33 PM

Share

Major : విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తాజాగా ఈ కుర్ర హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ నటించిన మేజర్ విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. ఇదిలా ఉంటే మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.

అడివి శేష్ సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట సాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట ఉంది. వారు తమ ప్రేమను లేఖల ద్వారా వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇక ఈ లిరికల్ వీడియోలో వారిద్దరి చిన్న నాటి జ్ఞాపకాలను కూడా చూపించారు. ఈ పాటలో మేజర్, ఇషాల మధ్య ప్రేమను అద్భుతంగా చూపించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా చూపించనున్నారు. ముంబై అటాక్, మేజర వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్, టీజర్‌లోని ఎమోషన్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Hyderabad: సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మల్టిప్లెక్స్ థియేటర్లలో తగ్గిన సినిమా టికెట్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్