Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

కరోనా కల్లోలం మరోసారి మొదలైంది. క్రమక్రమంగా కేసులు పెరుగుతుండటం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2022 | 2:48 PM

Mahesh Babu: కరోనా కల్లోలం మరోసారి మొదలైంది. క్రమక్రమంగా కేసులు పెరుగుతుండటం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ మహమ్మారీ ఎవరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇక ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీల కు కరోనా రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చందుతున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అందరిని ఈ మహమ్మారి కమ్మేస్తుంది. ఇప్పటికే  రీసెంట్ గా కమల్ హాసన్, యాక్షన్ కింగ్ అర్జున్, కరీనా కపూర్, అరుణ్ విజయ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, మంచు మనోజ్ ఇలా అందరు కరోనా బారిన పడ్డారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా వ్యాపించింది. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని మహేష్ కోరారు. వైద్యుల సలహాతో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నటు ప్రకటించారు మహేష్. అలాగే అందరు మాస్క్లు ధరించి జాగ్రత్త ఉండాలని సూచించారు. మహేష్ కు కరోనా పాజిటివ్ అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే మహేష్ ఆరోగ్యం కోసం కొందరు అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చూపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సమ్మర్ కు సినిమా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Hyderabad: సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మల్టిప్లెక్స్ థియేటర్లలో తగ్గిన సినిమా టికెట్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..