AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: ఆ స్టార్‌ హీరోతో ప్రేమాయణం సాగిస్తోన్న ఇస్మార్ట్‌ బ్యూటీ!.. త్వరలోనే పెళ్లి?

'ఇస్మార్ట్‌' బ్యూటీ నిధి అగర్వాల్‌ ఓ తమిళ స్టార్‌ హీరోతో ప్రేమలో ఉందా? ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉంటోందా? త్వరలోనే అతనితో కలిసి పెళ్లిపీటలెక్కుతోందా? అంటే అవుననే అంటున్నాయి

Nidhhi Agerwal: ఆ స్టార్‌ హీరోతో ప్రేమాయణం సాగిస్తోన్న ఇస్మార్ట్‌ బ్యూటీ!.. త్వరలోనే పెళ్లి?
...
Basha Shek
|

Updated on: Jan 08, 2022 | 10:18 AM

Share

‘ఇస్మార్ట్‌’ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఓ తమిళ స్టార్‌ హీరోతో ప్రేమలో ఉందా? ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉంటోందా? త్వరలోనే అతనితో కలిసి పెళ్లిపీటలెక్కుతోందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ఇటీవల ‘మానాడు’ సినిమాతో గ్రేట్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన శింబుతో నిధి రిలేషన్‌షిప్‌లో ఉందని ఓ క్రేజీ రూమర్‌ సినిమా ప్రియులను బాగా ఆకర్షిస్తోంది. కాగా శింబు, నిధి ఇద్దరూ ‘ఈశ్వరన్‌’ అనే సినిమాలో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. గతేడాది జనవరిలో ఈ సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. కరోనా సమయంలో శింబుతో ప్రేమలో పడ్డ నిధి గత కొంతకాలంగా చెన్నైలోని అతని ఇంట్లోనే ఉంటోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ లవ్‌ బర్డ్స్‌ పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. మరి ఇదెంతవరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా ‘మున్నా మైఖేల్‌’ అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది నిధి అగర్వాల్‌. ఆతర్వాత నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆతర్వాత అఖిల్‌తో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’లో మెప్పించింది. ఇక ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తో కెరీర్‌లో తొలిసారి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. ఇక శింబు విషయానికి వస్తే ‘మానాడు’ సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ను అందుకున్నాడు . వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది.

Also Read:

Pushpa: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. పుష్ప ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు.. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌లోనూ న్యూ విజువల్స్‌..

Viral news: ఇది లూడో ప్రేమ కథా చిత్రమ్‌.. పాక్‌ యువకుడితో రాజస్థాన్‌ మహిళ లవ్‌.! ఫైనల్‌ ట్విస్ట్‌ మాములుగా లేదుగా..

Viral video: ఈ ఖైదీ చాలా ఇంటెలిజెంట్‌.. చేతికి సంకెళ్లున్నా ఎలా తప్పించుకున్నాడో చూడండి..