Viral news: 40 వసంతాల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిపీటలెక్కింది.. పెళ్లి కుమారుడు ఎవరో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

ప్రేమకు కులం, మతం, వయసు, ప్రాంతం, భాష, కలర్‌తో సంబంధం లేదు. అదేవిధంగా సరిహద్దులు, లింగ భేదాలు కూడా ఉండవు. అందుకే చాలామంది ఖండాంతరాలు

Viral news: 40 వసంతాల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిపీటలెక్కింది.. పెళ్లి కుమారుడు ఎవరో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2022 | 8:02 AM

ప్రేమకు కులం, మతం, వయసు, ప్రాంతం, భాష, కలర్‌తో సంబంధం లేదు. అదేవిధంగా సరిహద్దులు, లింగ భేదాలు కూడా ఉండవు. అందుకే చాలామంది ఖండాంతరాలు దాటి తమ జోడిని వెతుక్కున్నారు. వయసులో తనకంటే చిన్నవాళ్లను భాగస్వామ్యులుగా చేసుకోవడం మనం చూశాం. అయితే అమెరికాకు చెందిన ఒక మహిళ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే అందరూ నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆమె పెళ్లాడింది తనకెంతో ఇష్టమైన పింక్‌ (గులాబి) కలర్‌ని. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది వాస్తవం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన కిట్టెన్ కే సెరా అనే మహిళకు పింక్‌ కలర్‌ అంటే ఎంతో ఇష్టం. ఎంతలా అంటే.. ఆ కలర్‌తో 40 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉందని చెబుతోందీ అమెరికన్‌ లేడీ. ఈ క్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంది. జనవరి ఒకటో తేదీన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్‌గా పింక్‌ కలర్‌ని పెళ్లి చేసుకుంది.

40 ఏళ్లుగా ప్రేమలో.. అనంతరం పింక్‌ కలర్‌తో తన పెళ్లివేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక్కడ విశేషమేమిటంటే.. సెరా తన వివాహ వేడుకలో కూడా పింక్‌ కలర్‌ దుస్తుల్లోనే ముస్తాబైంది. జుట్టుకు కూడా పింక్ రంగునే వేసుకుంది. చివరకు ఆమె ధరించిన ఆభరణాలు , లిప్‌స్టిక్, వెడ్డింగ్‌ రింగ్‌, మ్యారేజ్‌ కేక్.. ఇంకా పెళ్లి వేదికలోని వస్తువులన్నీ దాదాపు గులాబి రంగులోనే ఉన్నాయి. కాగా వివాహానికి హాజరైన అతిథులందరూ కూడా గులాబీ రంగు దుస్తులు ధరించడం విశేషం.

వేరే వ్యక్తిని చూడను.. కాగా నిత్యం పింక్ కలర్లోనే దర్శనమిచ్చే సెరాను చూసి ఒకరోజు ఒక చిన్న పిల్లాడు ‘నీకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా’ అని అడగ్గా సంతోషంతో మురిసిపోయిందీ ముద్దుగుమ్మ. ‘అయితే పింక్‌ కలర్‌నే పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని ఆ బాలుడు చెప్పాడట. అప్పటి నుంచే గులాబీ రంగుని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో పడిపోయింది సెరా. అనుకున్నట్లే తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. గ్రాండ్‌గా గులాబీరంగుతో పెళ్లిపీటలెక్కింది. ‘పెళ్లయ్యాక వేరే వ్యక్తిని కన్నెత్తి చూడను. నేను చనిపోయేవరకూ పింక్ కలర్ డ్రెస్సులు తప్ప వేరే రంగు దుస్తులను ధరించను’ అని పెళ్లి వేడుకలో ప్రమాణం చేసిందీ పింక్‌ బ్యూటీ.

Also read:

Coronavirus: సినిమా తారలను వెంటాడుతున్న కరోనా.. వైరస్‌ బారిన పడిన సత్యరాజ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు పాజిటివ్‌..