Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరీ జగన్నాథ్‌ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల10 నుంచి 31 వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని వారు పేర్కొన్నారు.

Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..
Puri Jagannatha Temple
Follow us

|

Updated on: Jan 08, 2022 | 6:39 AM

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరీ జగన్నాథ్‌ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల10 నుంచి 31 వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని వారు పేర్కొన్నారు. ఆలయ ప్రతినిధుల బృందం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భక్తులు, అర్చకుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు పూరీ జిల్లా కలెక్టర్‌ సమర్త్‌ వర్మ వెల్లడించారు. కాగా పలువురు ఆలయ సిబ్బంది, అర్చకులు కొవిడ్‌ బారిన పడినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పలు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్‌ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజులోనే 2,703 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.

నైట్‌ కర్ఫ్యూ అమలు.. కాగా కరోనాను కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నేటి(జనవరి8) నుంచి రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని భువనేశ్వర్‌, కటక్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌కే ప్రియదర్శి ప్రకటించారు. అదేవిధంగా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు 100మందిని, అంత్యక్రియలకు 50లోపు మందిని మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. హోటళ్లు, సినిమా హాళ్లు, కిరాణా షాపుల దగ్గర ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారులదేనని హెచ్చరించారు. Also Read:

ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్

MS Dhoni: మళ్లీ అభిమానుల మనసు గెల్చుకున్న ఎం.ఎస్‌.ధోని.. పాక్‌ క్రికెటర్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపిన టీమిండియా మాజీ కెప్టెన్‌..

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24 గంటల్లో ఏకంగా..