- Telugu News Photo Gallery Spiritual photos Know famous lord Vishnu temples in India, tirumala tirupati, puri jagannath temple,
Lord Vishnu: కేవలం దర్శనంతోనే అన్ని కోరికలు నెరవేర్చే విష్ణువుకు చెందిన దేశంలోని ఐదు ప్రసిద్ధ దేవాలయాలు..
Lord Vishnu: భారతదేశంలో ఆధ్యాత్మకతకు నెలవు.. ఇక్కడ అనేక అద్భుతమైన, రహస్యమైన దేవాలయాలు చాలా ఉన్నాయి, ఈ ఆలయాల దర్శనం తోనే బాధలను తొలగిస్తామని భక్తుల నమ్మకం. లోక రక్షకుడిగా పూజింపడుతున్న శ్రీ మహావిష్ణువుకు చెందిన ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jan 07, 2022 | 7:27 PM

సనాతన సంప్రదాయంలోత్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు ప్రపంచాన్ని పోషించే దేవుడిగా కీర్తిస్తారు. విష్ణువు తన భక్తులను అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను తీరుస్తాడు. పురాణాలలో.. శ్రీ హరిని ఆరాధించి తమకు వచ్చిన బాధలనుంచి భయపడిన కథలు అనేకం ఉన్నాయి. భూమిపై పాపాలు పెరిగినప్పుడల్లా.. పాపబారం తగ్గించడానికి విష్ణువు భూమిపై అవతరిస్తాడని నమ్ముతారు. వైష్ణవ సంప్రదాయాన్ని విశ్వసించే వారు తమ ఆరాధ్య దైవాన్ని అనంతమైన శక్తికి నిలయంగా భావించి వివిధ రూపాల్లో పూజిస్తారు. విష్ణువు యొక్క వివిధ రూపాలకు లేదా అతని అవతారాలకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. దేశంలోని కొన్ని ప్రసిద్ధ విష్ణు దేవాలయాల గురించి తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం తిరుమలతిరుపతి. ఇక్కడ విష్ణువు శ్రీ వేంకటేశ్వర స్వామిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు.

ఒడిషాలోని పూరీ నగరంలోని ప్రసిద్ధ దేవాలయం జగన్నాథ దేవాలయం. ఇక్కడ విష్ణువు అవతారమైన కృష్ణుడు జగన్నాథుడిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. జగన్నాథుడు అంటే ప్రపంచం మొత్తానికి ప్రభువు. ఈ విష్ణు దేవాలయం సనాతన సంప్రదాయానికి సంబంధించిన నాలుగు ప్రధాన ధాములలో ఒకటి. ప్రతి సంవత్సరం జగన్నాథుని భారీ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది.

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం కూడా దేశంలోని గొప్ప దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజులు నిర్మించారు. ఈ విష్ణు దేవాలయంలో ఆదిశేషుడు మీద నిద్రిస్తున్న విష్ణువు విగ్రహం ఉంది. పద్మనాభస్వామి ఆలయం వైష్ణవ భక్తులకు గొప్ప పుణ్యక్షేత్రం

నాలుగు ప్రధాన ధాములలో ఒకటైన బద్రీనాథ్ ఆలయం.. విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది ఒడ్డున నార, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ బద్రీనాథ్ విగ్రహం చతుర్భుజ భంగిమలో ఉన్న శాలిగ్రామ శిలతో చేయబడింది. దక్షిణ భారతదేశంలోని పూజారులు ఈ ఆలయంలో ఆయనకు పూజలు చేస్తారు

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉన్న బాంకీ బిహారీ జీ ఆలయం విష్ణువు కు చెందిన ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయ దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. బాంకే బిహారీ శ్రీకృష్ణుడు, రాధ లు పూజిస్తారు. మహావిష్ణువును దర్శనం చేసుకుంటే.. జీవితంలోని దోషాలు,ఆటంకాలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.




