Horoscope Today: వారు గొడవలకు దూరంగా ఉండాలి.. ఈ రోజు రాశిఫలాలు

Today Horoscope: ప్రతిరోజూ ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను

Horoscope Today: వారు గొడవలకు దూరంగా ఉండాలి.. ఈ రోజు రాశిఫలాలు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2022 | 6:47 AM

Today Horoscope: ప్రతిరోజూ ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున శనివారం (జనవరి 8న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశి వారు చేపట్టబోయే పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటపట్టింపులకు అస్సలు పోకండి. ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సాయం అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి.

వృషభం: ఈ రాశివారికి తోటివారి సాయం అందుతుంది. వారి ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో శుభఫలితాలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ముందుకుసాగుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం: ఈ రోజు ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: ఈ రాశి వారు చేపట్టబోయే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రులు, సన్నిహితుల సూచనలు తీసుకోవడం మంచిది.

సింహం: ఈ రాశివారికి అనుకూలమైన సమయం. బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి కీలక విషయాల గురించి ప్రస్తావిస్తారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఈ రోజు కీలక వ్యవహారంలో పైచేయి సాధిస్తారు. కొందరి ప్రవర్తన వల్ల కొన్ని చికాకులు ఎదురవుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల: ఈ రాశివారు ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. విందూ వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం: ఈ రోజు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాల గురించి ఆందోళన తగదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు: ఈ రోజు చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. తరచూ తీసుకునే నిర్ణయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సాయం అందుతుంది.

మకరం: ఈ రాశివారికి అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందూవినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం: ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సాయంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం: ఈ రాశివారు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక విషయంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.

Also Read:

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు..!

Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..

పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..