AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల వారు పొదుపు చేయడంలో నిష్ణాతులు, వృధా ఖర్చులను ఇష్టపడరు..

Astrology Tips: జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులుంటాయి. తొమ్మిది గ్రహాలుంటాయి. ఈ గ్రహ ప్రభావం రాశులపై చూపిస్తుంది. దీంతో ఆ రాశుల వ్యక్తుల స్వభావం కూడా ప్రభావితమవుతుంది..

Zodiac Signs: ఈ రాశుల వారు పొదుపు చేయడంలో నిష్ణాతులు, వృధా ఖర్చులను ఇష్టపడరు..
Zodiac Money
Surya Kala
|

Updated on: Jan 08, 2022 | 3:17 PM

Share

Astrology Tips: జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులుంటాయి. తొమ్మిది గ్రహాలుంటాయి. ఈ గ్రహ ప్రభావం రాశులపై చూపిస్తుంది. దీంతో ఆ రాశుల వ్యక్తుల స్వభావం కూడా ప్రభావితమవుతుంది. ఈరోజు కొంతమంది తాము సంపాదించిన డబ్బులను పొదుపుగా అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలనుకుంటారు.. మరికొందరు… సంపాదించింది.. అవసరమైనా సరే ఖర్చు పెట్టకుండా పొదుపు పేరుతొ పిసినారిలా ఉంటారు.. మరికొందరు అవసరానికి మించి ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ.. ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటారు. ఈరోజు కొన్ని రాశులు తాము సంపాదించిన డబ్బుని పొదుపు చేసే గుణం కలిగి ఉంటారు.. ఆ రాశులు ఏమిటో చూద్దాం..

వృషభ రాశి: ఈ  రాశి వారు ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. అయితే తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి..  వారు తమ అభిరుచులను నెరవేర్చుకోవడానికి డబ్బును వృధా చేయరు. పూర్తి ప్లానింగ్ వేసుకుని బడ్జెట్ ప్రకారం తమకు నచ్చిన వస్తువులు కొంటారు. ఈ రాశి వ్యక్తుల దృష్టి వస్తువుల నాణ్యతపై ఉంటుంది. డబ్బును ఎలా ఆదా చేయాలో కూడా వీరికి బాగా తెలుసు.

సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు సామాజికంగా పేరుప్రఖ్యాతలు పొందుతారు. ఈ వ్యక్తులు చాలా డబ్బు ఖర్చు చేస్తారు.. అదే సమయంలో తమ సంపాదనలో కొంతమొత్తమైనా పొదుపు చేయడానికి శ్రద్ధ వహిస్తారు. అందుకనే ఈ రాశివారికి ఎప్పుడూ డబ్బు పరంగా ఎలాంటి నష్టం వాటిల్లదు. అయితే తమ డబ్బులను ఇతరుల కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడతారు.. కానీ ఎవరి నుండి డబ్బు సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ వ్యక్తులు తమ డబ్బును  పెట్టుబడి పెట్టి.. లాభాలను ఆర్జిస్తారు.

మిథున రాశి : ఈ రాశి వారు చాలా తెలివైనవారు. వారు చాలా అలోచించి డబ్బు పెట్టుబడి పెడతారు. తన సంపదను రెట్టింపు,  నాలుగు రెట్లు ఎలా పెంచుకోవాలో వీరికి బాగా తెలుసు. అందుకనే ఈ రాశివారు మంచి పెట్టుబడిదారులుగా ఉంటారు. ఎక్కడైనా డబ్బు ఖర్చు పెట్టే ముందు చాలా ఆలోచిస్తారు. వీరిని ఏ విషయంలోనూ మభ్యపెట్టడం అంత తేలిక కాదు.

మకర రాశి: ఈ రాశి వారు ధనాన్ని కూడబెట్టడంలో నిష్ణాతులు. అంతేకాదు డబ్బును చాలా అలోచించి ఖర్చు చేస్తారు. ఈ వ్యక్తులు కుటుంబ సభ్యులకు మంచి రక్షణ, ఆర్ధిక భరోసా ఇస్తారు. అందుకనే  ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు. వీరికి సమాజంలో ఎంతో గౌరవం, గౌరవం లభిస్తాయి.

Also Read:

 రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…

ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం రాబోతున్నట్లే..!

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..