Krishna District: రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…

విధి.. మనుషులతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. కొన్నిసార్లు జరిగిన ఘటనలకు ఎవరిని నిధించాలో కూడా అర్థం కాదు.

Krishna District: రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా...
Road Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2022 | 3:08 PM

విధి.. మనుషులతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. కొన్నిసార్లు జరిగిన ఘటనలకు ఎవరిని నిధించాలో కూడా అర్థం కాదు. తాజాగా కృష్ణాజిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన కూడా అదే కోవకు చెందినది.  ఎ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఓ యాక్సిడెంట్ జరిగింది.  లారీ ఢీకొనడంతో గొల్లమందలకు చెందిన తేళ్లూరి బాబు స్పాట్‌లోనే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని తిరువూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తమ్ముడు తేళ్లూరి రామారావు.. అన్న మృతదేహాన్ని చూసేందుకు బైక్ బయలుదేరాడు.

జీల్లకుంట దగ్గరకు రాగానే.. రామారావు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని తిరువూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని గంటల వ్యవధిలోనే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అన్నదమ్ములు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

Also Read: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి