East Godavari: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..

కొబ్బరి రైతు ఒకరు చెట్టెక్కి కొబ్బరి కాయలు కోస్తున్న సమయంలో పక్కనే వున్న పాడుపడ్డ బావిలో కొన్ని కొబ్బరి కాయలు పడిపోయాయి. దాంతో నూతిలో నుండి కొబ్బరి కాయలు తీసేందుకు యత్నించాడు.

East Godavari: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..
Snake In Well
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2022 | 3:23 PM

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో రక్తపింజరాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొదలు, పుట్టలు కొట్టుకు పోవటంతో పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే కొబ్బరి కాయలు దింపుతున్న రైతుకు పెద్ద ప్రమాదం తప్పింది.

కొబ్బరి రైతు ఒకరు చెట్టెక్కి కొబ్బరి కాయలు కోస్తున్న సమయంలో పక్కనే వున్న పాడుపడ్డ బావిలో కొన్ని కొబ్బరి కాయలు పడిపోయాయి. దాంతో నూతిలో నుండి కొబ్బరి కాయలు తీస్తుండగా, 5 అడుగుల అత్యంత విషపూరితమైన రక్త పింజరి బయటపడింది. బుసలు కొడుతున్న పామును చూసి కొబ్బరి రైతులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయంతో తోట నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. సర్పాన్ని చాకచక్యంగా బంధించిన వర్మ.. అది గర్భంతో ఉన్నట్లుగా గుర్తించారు. పాము పొట్టలో 60 నుండి 100 పిల్లలు ఉండి ఉంటాయని స్నేక్ క్యాచర్ వర్మ తెలిపారు. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో పామును వదిలిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Krishna District: రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి