Konaseema Sankranti: కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సంప్రదాయం దుస్తుల్లో.. ప్రభల ఊరేగింపులో స్టూడెంట్స్…
Konaseema Sankranti: తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి.. నెల రోజుల ముందునుంచే ముగ్గులు, గొబెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో మొదలయ్యే పండగ..
Konaseema Sankranti: తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి.. నెల రోజుల ముందునుంచే ముగ్గులు, గొబెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో మొదలయ్యే పండగ.. తెలుగువారి లోగిళ్ళలో సందడి నెలకొంటుంది. సంక్రాంతి పండగ వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల్లో కళకళలాడుతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ.. పండగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లెలకు చేరుకుంటాయి.
ముఖ్యంగా పంటలు ఇంటికి వచ్చేవేళ కోనసీమలో సంక్రాంతి సంబరాలు నాలుగు రోజుల పాటు భోగి, సంక్రాంతి (పెద్దల పండగ), కనుమ, ముక్కనుమ గా అంగరంగ వైభంగా జరుపుకుంటారు. నెల రోజుల ముందు నుంచి ఇంటింటా ముగ్గులు, గొబ్బెమ్మలతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి పండగ వారం రోజుల ముందే వచ్చింది.
కోనసీమలో సంక్రాంతి సంబరాల్లో విద్యార్థుల సందడి చేశారు. పి.గన్నవరం మండలం జడ్పీ హైస్కూల్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. స్కూల్ పిల్లలకు మన సంప్రదాయం, తెలిసే విధంగా సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. గొబ్బెమ్మలతో అమ్మాయిల ఆటపాటలు, ప్రభల ఊరేగింపుతో సందడితో విద్యార్థులు సందడి చేశారు. స్టూడెంట్స్ తో పాటు ఈ సంబరాలకు ఊరు ఊరు తరలి వచ్చింది. తెలుగు సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియలనే ఇలా పిల్లలచేత సంక్రాంతి సంబరాలు నిర్వహించామని ఉపాధ్యాయులు చెప్పారు.
Also Read : సమస్యల సుడిగుండంలో పాక్.. సాయం కోసం డ్రాగన్ వైపు చూపు.. వచ్చే నెల చైనాకు ఇమ్రాన్..