AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: సమస్యల సుడిగుండంలో పాక్.. సాయం కోసం డ్రాగన్ వైపు చూపు.. వచ్చే నెల చైనాకు ఇమ్రాన్..

Imran Khan China Visit: పాకిస్థాన్‌లో ఓ వైపు కరోనా, మరోవైపు ఆహార సంక్షోభం,  ఆర్ధిక సమస్యలు ఇలా అన్నీ ఒక్కసారే చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని వచ్చే నెలలో చైనాలో..

Imran Khan: సమస్యల సుడిగుండంలో పాక్.. సాయం కోసం డ్రాగన్ వైపు చూపు.. వచ్చే నెల చైనాకు ఇమ్రాన్..
Imran
Surya Kala
|

Updated on: Jan 08, 2022 | 4:50 PM

Share

Imran Khan China Visit: పాకిస్థాన్‌లో ఓ వైపు కరోనా, మరోవైపు ఆహార సంక్షోభం,  ఆర్ధిక సమస్యలు ఇలా అన్నీ ఒక్కసారే చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం,  బడ్జెట్ లోటు,  ఆర్థిక సవాళ్లతో పాటు పెరుగుతున్న రుణాల కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ వ్యతిరేకను తగ్గించుకునే విధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపట్టారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వచ్చే నెలలో బీజింగ్‌ను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు.  పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడులు పెట్టె విధంగా ఈ పర్యటన చేపట్టనున్నట్లు    స్థానిక మీడియా పేర్కొంది.

విదేశీ పెట్టుబడిదారులకు మార్గం సులభతరం చేయడానికి ఇమ్రాన్ ఖాన్ 37 నిబంధనలను తొలగించారని తెలిపింది.  చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల పురోగతిని ప్రతి 15 రోజులకోసారి ప్రధాని స్వయంగా  పర్యవేక్షిస్తారని ప్రధానికి ప్రత్యేక సహాయకుడు ఖలీద్ మన్సూర్ పేర్కొన్నట్లు  ఆదేశ ప్రముఖ వార్తాపత్రిక తెలిపింది.

దేశంలో వాణిజ్య లోటు:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆ దేశ వాణిజ్య లోటు 24.79 బిలియన్ డాలర్లకు చేరిన తరుణంలో పాకిస్థాన్ ప్రధాని చైనా పర్యటనకు వెళ్లనున్నారు. వార్షిక ప్రాతిపదికన దిగుమతులు 63 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణం. దిగుమతులు భారీగా పెరగడం వల్ల వాణిజ్య లోటు పెరిగింది. గత ఏడాది జూలై-డిసెంబర్ లో దిగుమతులు $ 24.47 బిలియన్ల నుండి $ 39.91 బిలియన్లకు పెరిగాయి.

ఆర్థిక సవాళ్లు:  జూలై-డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు కూడా 25 శాతం పెరిగి US$ 15.13 బిలియన్లకు చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది . కనీసం మినీ బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని స్టేజ్ కు చేరుకుందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై పాలక ప్రభుత్వంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నాయి. దేశంలో ఏర్పడిన సవాళ్ళను ఎదుర్కోవడంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైనందున ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తున్నారు.

Also Read:  ‘రేపో, ఎల్లుండో చచ్చిపోతా.. తగలబెట్టేస్తారు అనుకున్నా’.. రాజశేఖర్’ సంచలన కామెంట్స్