Rajasekhar: ‘రేపో, ఎల్లుండో చచ్చిపోతా.. తగలబెట్టేస్తారు అనుకున్నా’.. రాజశేఖర్’ సంచలన కామెంట్స్
Rajasekhar-Jeevita: కరోనా వెలుగులోకి వచ్చిన ఈ రెండేళ్లలో.. ఈ మహమ్మారి బారిన పడి సినీ రాజకీయ, సామాన్యుల ప్రజల సహా ఎందరో మహామహులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తమ కుటుంబ సభ్యులను,..
Rajasekhar-Jeevita: కరోనా వెలుగులోకి వచ్చిన ఈ రెండేళ్లలో.. ఈ మహమ్మారి బారిన పడి సినీ రాజకీయ, సామాన్యుల ప్రజల సహా ఎందరో మహామహులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తమ కుటుంబ సభ్యులను, తమ అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ కరోనాతో కాలం చేశారు. అయితే ఈ కరోనా వైరస్ బారిన పడిన.. ఎందరో ప్రాణ కోసం పోరాడుతూ మృత్యు అంచుల వరకూ వెళ్లివచ్చారు. అలా ఈ వైరస్ బారిన పడి.. పోరాడి ప్రాణాలతో బయటపడిన సినీ సెలబ్రెటీల్లో ఒకరు టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్.
తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులు అలీ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ భార్యాభర్తలు అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తాజాగా అలీతో సరదాగా షో లో పాల్గొన్న ప్రోమో ఒకటి రిలీజయింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను కరోనా వచ్చి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో చచ్చిపోతాను అనుకున్నట్లు రాజశేఖర్ చెప్పారు. ఒకానొక దశలో పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించిందని… ఇక రేపో, ఎల్లుండో తాను మరణిస్తానని.. తగలబెట్టేస్తారని అనుకున్నట్లు ఎంతో ఉద్వేగభరితంగా చెప్పారు రాజశేఖర్.
జీవిత కూడా రాజశేఖర్ గురించి మాట్లాడుతూ.. శేఖర్ సినిమా ఇక వారం రోజుల్లో మొదలు పెడతామని అనుకున్న సమయంలో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారని.. తర్వాత పరిస్థితి విషమంగా మారింది.. సుమారు నెల రోజుల పాటు.. ఆస్పత్రిలో ఐసియులో చికిత్స తీసుకున్నారని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
2020 అక్టోబర్ నెలలో రాజశేఖర్ కోవిడ్ బారిన పడ్డారు.. సుమారు నెల రోజుల పాటు ఐసియులో ఉండి చికిత్స తీసుకున్నారు. దాదాపు చావు అంచుల వరకూ వెళ్లి వచ్చి.. తిరిగి కోలుకుని మాములు మనిషి అయ్యారు. ఇప్పుడు శేఖర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే తనకు శేఖర్ సినిమా చాలా ప్రత్యేకం అని జీవిత చెప్పారు. ఎందుకంటే.. మరణం అంచుల వరకూ వెళ్లి కోలుకుని తిరిగి వచ్చి చేసిన సినిమా కనుక అంటూ జీవిత చెప్పారు. ఈ షోలో తమ పరిచయం, ప్రేమ, జీవిత గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ తనకు వారసుడు అంటే ఇష్టమని రాజశేఖర్ చెప్పారు.
Also Read: