SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మీ అకౌంట్‌ బ్లాక్ అయిందని మెస్సేజ్ వచ్చిందా..?

SBI Clients: సైబర్‌ నేరగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేశారు. అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేయడానికి కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. అమాయకులను

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మీ అకౌంట్‌ బ్లాక్ అయిందని మెస్సేజ్ వచ్చిందా..?
Sbi
Follow us

|

Updated on: Jan 08, 2022 | 4:07 PM

SBI Clients: సైబర్‌ నేరగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేశారు. అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేయడానికి కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. అమాయకులను బోల్తా కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఎస్బీఐ పంపించినట్లు ఒక ఫేక్ మెస్సేజ్‌ సృష్టించి ఖాతాదారులను పరేషాన్ చేస్తున్నారు. “డియర్ A/c హోల్డర్ మీ SBI బ్యాంక్ డాక్యుమెంట్‌ల గడువు ముగిసింది A/c బ్లాక్ చేయబడుతుంది. వెంటనే మీ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేయండి ” అని వచన సందేశాన్ని పంపుతున్నారు. ఈ మెస్సేజ్ రావడంతో ఖాతాదారులలో ఆందోళన నెలకొంటుంది. ఈ ఫేక్‌ మెస్సేజ్‌కి లింక్ కూడా యాడ్ చేశారు. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి కస్టమర్‌లు ఈ డేంజర్‌ లింక్‌ని ఓపెన్ చేయాలి. అయితే అలాంటి లింక్‌లపై అస్సలు క్లిక్ చేయకూడదు.

ఇది ఫేక్ మెస్సేజ్‌. ఈ స్కామ్ గురించి మరింత మందికి తెలియజేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. ట్విట్టర్‌లోని తన ఫ్యాక్ట్-చెకింగ్ హ్యాండిల్ ద్వారా @PIBFactCheck, PIB ప్రజలు ఇలాంటి SMS, ఈ మెయిల్‌లకు స్పందించకూడదని స్పష్టం చేసింది. ఇటువంటి మెస్సేజ్‌లను report.phishing@sbi.co.inలో నివేదించాలని ప్రజలను కోరింది అమాయక ఖాతాదారులు వీటిని నమ్మి మోసపోకూడదు. లాటరీ, KYC అప్‌డేట్ లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ సాకుతో సైబర్‌ నేరగాళ్లు భారతదేశంలోని చాలా మంది బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దోచుకున్నారు. ముఖ్యమైన IDలు/పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి ఇలాంటి ట్రిక్కులు ప్రయోగిస్తారు. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి.

David Warner Kohli: కోహ్లీ వరుస వైఫల్యాలపై స్పందించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌.. ఏమన్నాడంటే..

Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ విషయాన్ని కాజల్ ఇలా చెప్పేసిందా ?.. చిన్నారి కోసం ఎదురుచూస్తున్నానంటూ..

Magic Blanket: ఆ దుప్పటి ఇవ్వగానే దివ్యాంగుడికి కాళ్లు.. చకచకగా నడుచుకుంటూ.. నెట్టింట్లో వీడియో వైరల్‌