AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల పేరుపై మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ప్రారంభించండి.. 15 సంవత్సరాల తర్వాత 30 లక్షలు పొందండి..

Child Mutual Fund: చైల్డ్ మ్యూచువల్ ఫండ్‌ని చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అని కూడా అంటారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చైల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు.

పిల్లల పేరుపై మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ప్రారంభించండి.. 15 సంవత్సరాల తర్వాత 30 లక్షలు పొందండి..
Mutual Fund
uppula Raju
|

Updated on: Jan 08, 2022 | 5:34 PM

Share

Child Mutual Fund: చైల్డ్ మ్యూచువల్ ఫండ్‌ని చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అని కూడా అంటారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చైల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. దీనివల్ల పిల్లలు పెద్దైన తర్వాత చదువు లేదా వివాహ ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే చైల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో చాలా ఫీచర్లు ఉన్నాయి. డిపాజిటర్ తన బిడ్డ కోసం తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా చివరకి అది పెద్దమొత్తంగా మారుతుంది. తర్వాత ఈ మొత్తం పిల్లల ఉన్నత చదువులకు లేదా పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ డబ్బుతో సొంత ఇల్లు లేదా తన సొంత కారును కొనుగోలు చేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అటువంటి ఖర్చులను సౌకర్యవంతంగా కవర్ చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చైల్డ్ మ్యూచువల్ ఫండ్ అతిపెద్ద లక్షణం పన్ను ఆదా. పిల్లల పేరిట మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు డిపాజిట్ చేసినన్ని రోజులకు మీరు ఆదాయపు పన్ను చెల్లించడం అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడినట్లయితే అందులో ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్, HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్, ఫ్రాంక్లిన్ చిల్డ్రన్స్ అసెట్ ప్లాన్, UTI చిల్డ్రన్స్ కెరీర్ ప్లాన్, యాక్సిస్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ఉన్నాయి. .

ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ ఇందులో పిల్లల పేరు మీద ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ.24 లక్షలు అవుతుంది. ఆగస్ట్ 31, 2001న ప్రారంభించిన ఈ ఫండ్ ఇప్పటివరకు 15.48 శాతం చొప్పున రాబడులను ఇస్తోంది. అదేవిధంగా, మీరు హెచ్‌డిఎఫ్‌సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌లో నెలవారీ రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే, 15 సంవత్సరాల తర్వాత పిల్లల పేరు మీద రూ.30 లక్షల మొత్తాన్ని సేకరించవచ్చు. HDFC చిల్డ్రన్స్ ఫండ్, మార్చి 2, 2001న ప్రారంభించారు. ఇప్పటి వరకు 16.12 శాతం రాబడిని అందిస్తోంది.

SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అదేవిధంగా మీరు మీ పిల్లల పేరు మీద SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్‌లో నెలవారీ 5000 రూపాయల పెట్టుబడి 15 సంవత్సరాల తర్వాత మీ పిల్లల పేరు మీద 20 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ ఫండ్ 21 ఫిబ్రవరి 2002న ప్రారంభించారు. ఇప్పటి వరకు 10.36 శాతం రాబడిని ఇచ్చింది. 15 సంవత్సరాల పిల్లల మ్యూచువల్ ఫండ్ ఉత్తమంగా పరిగణిస్తారు. ఎందుకంటే పెట్టుబడిని పిల్లలు 3 లేదా 5 సంవత్సరాలలో ఉన్నప్పుడు ప్రారంభిస్తే 18, 20 సంవత్సరాలలోపు పెద్ద మొత్తాన్ని సేకరించవచ్చు.

Kitchen: ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. వెంటనే ఆరోగ్యం మెరుగవుతుంది..?

Chapati: కరోనా సమయంలో వీటితో చేసిన చపాతీలు బెస్ట్.. రోగనిరోధక శక్తిపెంచడంలో సూపర్..

Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?