Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?

Cool Drinks: కూల్‌డ్రింక్స్‌ అంటే ఇష్టపడేవారు జాగ్రత్తగా ఉండండి.. మీరు ఎంతో ప్రేమగా తాగే రెండు గ్లాసుల శీతల పానీయం మిమ్మల్నే మింగేస్తుంది. తీవ్రమైన క్యాన్సర్ బారిన

Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?
Cool Drinks
Follow us
uppula Raju

|

Updated on: Jan 08, 2022 | 3:01 PM

Cool Drinks: కూల్‌డ్రింక్స్‌ అంటే ఇష్టపడేవారు జాగ్రత్తగా ఉండండి.. మీరు ఎంతో ప్రేమగా తాగే రెండు గ్లాసుల శీతల పానీయం మిమ్మల్నే మింగేస్తుంది. తీవ్రమైన క్యాన్సర్ బారిన పడేస్తుంది. గట్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువ కూల్‌ డ్రింక్స్‌ తాగే పెద్దలు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదానికి గురవుతున్నారని తేలింది. పరిశోధనలో ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్‌, ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవిగా తేలాయి. మహిళలు 50 ఏళ్లు నిండకముందే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నందున మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దప్రేగు క్యాన్సర్ చాలా ప్రాణాంతకం. అయితే దానిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే కంట్రోల్‌ అవుతుంది.

పరిశోధన ఇలా జరిగింది ఈ పరిశోధనలో 95,464 మందిని సుమారు 24 సంవత్సరాలు పర్యవేక్షించారు. ఈ పరిశోధనలో కూల్‌డ్రింక్స్‌, ఇతర చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకున్న 109 మంది మహిళలకు 50 ఏళ్లలోపు పెద్దప్రేగు క్యాన్సర్ సమస్య ఉన్నట్లు కనుగొన్నారు. అదే సమయంలో ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ కూల్‌డ్రింక్స్‌ తాగే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే వారానికి ఒక కూల్‌డ్రింక్‌ తాగే మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. కూల్‌డ్రింక్స్‌ని తక్కువగా తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి హానికరం. ఈ పానీయాలలో కృత్రిమ చక్కెర, ప్రిజర్వేటివ్‌లు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. దీని అధిక వినియోగం ఊబకాయం సమస్యను పెంచుతుంది. పెరుగుతున్న స్థూలకాయం కారణంగా చిన్నతనంలోనే ప్రీమెచ్యూర్ హార్ట్, బీపీ, మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు చుట్టుముడతాయి. ఇది కాకుండా ఈ పానీయాలు మీ కాలేయానికి కూడా హాని చేస్తాయి. కాలేయం దానిలో ఉన్న ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేయడానికి చాలా కష్టపడాలి. దీని కారణంగా చాలా సార్లు కాలేయంలో వాపు ఉంటుంది. అందువల్ల యువత పిల్లలతో సహా ఏ వయస్సు వారైనా దాని వినియోగానికి దూరంగా ఉంటే మంచిది.

Travel With Children: కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త..?

SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

Acharya: మరోసారి మెగా అభిమానులకు నిరాశ తప్పదా ?.. ఆచార్య రిలీజ్ పై నెట్టింట్లో సందేహాలు..