SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

SEBI Recruitment: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకి చెందిన ఈ సంస్థ ముంబయి కేంద్రంగా ఉన్న ఆఫీసులో ఖాళీలను..

SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..
Follow us

|

Updated on: Jan 08, 2022 | 2:57 PM

SEBI Recruitment: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకి చెందిన ఈ సంస్థ ముంబయి కేంద్రంగా ఉన్న ఆఫీసులో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ (అసిస్టెంట్ మేనేజర్‌) పోస్టుల ఉన్నాయి.

* విభాగాల విషయానికొస్తే.. జనరల్ (80), లీగల్ (16), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (14), రిసెర్చ్ (7), ఆఫీషీయల్ లాంగ్వేజ్ (3) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు డిసెంబర్‌ 31, 2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులకు ముందుగా 3 దశల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో షార్ట్‌లిస్ట్‌ అయిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 24-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Chanakya Niti: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం రాబోతున్నట్లే..!

Tirumala Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అప్పుడు దర్శనం చేసుకోలేని భక్తులకు మళ్లీ ఛాన్స్..

China New Record: చైనా సరికొత్త రికార్డు.. ఏకంగా సూర్యడిని మించి శక్తిని ఉత్పత్తి చేసింది.. షాకింగ్ వివరాలివే..