China New Record: చైనా సరికొత్త రికార్డు.. ఏకంగా సూర్యడిని మించి శక్తిని ఉత్పత్తి చేసింది.. షాకింగ్ వివరాలివే..

China New Record: చైనా మరో కొత్త రికార్డు సృష్టించింది. ఆ దేశం సృష్టించిన కృత్రిమ సూర్యుడి ద్వారా 7 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసింది.

China New Record: చైనా సరికొత్త రికార్డు.. ఏకంగా సూర్యడిని మించి శక్తిని ఉత్పత్తి చేసింది.. షాకింగ్ వివరాలివే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 08, 2022 | 11:00 AM

China New Record: చైనా మరో కొత్త రికార్డు సృష్టించింది. ఆ దేశం సృష్టించిన కృత్రిమ సూర్యుడి ద్వారా 7 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసింది. అవును.. భూమిపైనే కృత్రిమ సూర్యడిని ప్రజ్వలింపజేసింది. వివరాల్లోకెళితే.. సూర్యుడి శక్తిని భూమ్మీదే ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల క్రితం బృహత్తర పరిశోధన చేపట్టింది. ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టోకామక్ పేరిట చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కృత్రిమ సూర్యుడిని తయారుచేసింది. ఇందులోని టోకోమాక్ రియాక్టర్ అచ్చం సూర్యుడి తరహాలోనే పనిచేస్తుంది.

తాజాగా చైనా శాస్త్రవేత్తలు దీనిని పరీక్షించారు. ఈ ప్రయోగంలో ఏకంగా 17.6 నిమిషాల పాటు శక్తిని ఉత్పాదన చేసింది. 1,056 సెకన్లలో 7 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. సూర్యుడి ఉష్ణోగ్రత 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ కాగా.. చైనా కృత్రిమ సూర్యుడు అంతకంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేయడం విశేషం. చైనా గతేడాది మేలో 1.6 నిమిషాల పాటు కృత్రిమ సూర్యుడ్ని మండించింది. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది. ఇందులో ప్రధానంగా డ్యుటేరియం పదార్థాన్ని అణు విచ్ఛిత్తి విధానంలో మండించి అమితమైన శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఫ్యూజన్ ఎనర్జీ పరికరం ఉంది. దీన్నే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తుంటారు. భవిష్యత్తులో దీని సాయంతో శక్తిని ఉత్పాదన చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవాలన్నది చైనా లక్ష్యం.

Also read:

Viral Video: సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్న శనక్కాయల వ్యాపారి పాట.. అదేంటో మీరే చూసేయండి..

Constable Food: కానిస్టేబులా మజాకా!.. ఆయన తిన్న పూరీల సంఖ్య తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

Viral Video: ఈ పక్షులు గూళ్లు చెట్టుపై పెట్టవు.. మరెక్కడ పెడుతుందో మీరూ చూడండి..