Constable Food: కానిస్టేబులా మజాకా!.. ఆయన తిన్న పూరీల సంఖ్య తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!
Constable Food: సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌ల గురించిన వార్తలు వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాం. బకెట్ ఛాలెంజ్ అని, ఐస్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ అని విన్నాం.
Constable Food: సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌ల గురించిన వార్తలు వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాం. బకెట్ ఛాలెంజ్ అని, ఐస్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ అని విన్నాం. వీటి మాదిరిగానే ఫుడ్ ఛాలెంజ్ కూడా ఒకటి. ఈ ఫుడ్ ఛాలెంజ్‌లో ఎవరు ఎంత ఎక్కువ తిన్నారో వారే గెలిచినట్లు లెక్క. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గొండా రిజర్వ్ పోలీస్ లైన్‌లో భారీ ఫుడ్ కాంపిటేషన్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ ఔరా అనిపించాడు. ఈ పోటీలో పాల్గొన్న ఆయన 10 కాదు 20 కాదు.. ఏకంగా 60 పూరీలు తిని తన రికార్డును తానే అధిగమించాడు.
రిక్రూట్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముందు బడా ఖానా పోటీని చేపట్టారు యూపీ పోలీసు ఉన్నతాధికారులు. నూతన రిక్రూటర్లు, ఉద్యోగులు కలిసి భోజనం చేసే ఉద్దేశంతో ఈ ఫన్నీ టాస్క్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే, గతంలో 51పూరీలు తిని రికార్డు నెలకొల్పిన హృషీకేష్ రాయ్ ఈసారి పోటీలో 60పూరీలను లాగించి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఈ పోటీలో గెలుపొందిన కానిస్టేబుల్ రాయ్‌ని పోలీస్ ఉన్నతాధికారులు సన్మానించారు.
Also read:
रिजर्व पुलिस लाइन गोंडा में आयोजित “बड़ा खाना” में 60 पूड़ी खाकर मु0आ0 ऋषिकेश राय ने तोड़ा अपना ही पूर्व रिकॉर्ड (51 पूड़ी), #SPGonda @IPS_SantoshM ने ₹1000 नगद पुरस्कार से किया सम्मानित। pic.twitter.com/la9B1s6XyB
— Gonda Police (@gondapolice) January 4, 2022
Also read:
Viral Video: ఈ పక్షులు గూళ్లు చెట్టుపై పెట్టవు.. మరెక్కడ పెడుతుందో మీరూ చూడండి..
Viral Video: ఇది మామూలు బాతు కాదండోయ్.. లక్షల్లో దీని సంపాదన.. అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు..!
Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. వ్యతిరేకిస్తున్న ప్రజలు..