Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. వ్యతిరేకిస్తున్న ప్రజలు..

Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే, అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు మందడం గ్రామస్తులు.

Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. వ్యతిరేకిస్తున్న ప్రజలు..
Amaravathi
Follow us

|

Updated on: Jan 08, 2022 | 9:14 AM

Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే, అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు మందడం గ్రామస్తులు. రాజధాని గ్రామాల్లో మూడవ రోజు జరిపిన ప్రజాభిసేకరణను పలు చోట్ల వ్యతిరేకించారు. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో మూడో రోజు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ACCMCలో రాజధాని గ్రామాల విలీనంపై ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. తుళ్లూరు మండలంలోని వెలగపూడి, మల్కాపురం, మందడం గ్రామాల్లో మూడోవ రోజు సభలు జరిగాయి. అన్ని గ్రామాల్లోనూ 19 గ్రామాలతో కూడిన ACCMCలో విలీనం అయ్యేందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. CRDA పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ACCMCలో విలీనం అవుతామంటున్నారు.

అయితే.. ప్రజల అభిప్రాయాలను, తీర్మానాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు. మొదట వెలగపూడిలో జరిగిన గ్రామ సభలో అధికారులను స్థానికులు నిలదీశారు. రేండున్నరేళ్లుగా సీఆర్‌డీఏ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. రోడ్ల తవ్వకాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని వాపోయారు. గ్రామ సభలు పెట్టే అధికారం కూడా లేదన్నారు. మొత్తం సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాలను కార్పొరేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు మందడం గ్రామస్తులు. ఇప్పటికే 9 గ్రామాల్లో గ్రామ సభలు జరుగగా.. మిగతా 10 గ్రామాల్లో సోమవారం నుంచి మొదలవుతాయి. శని, ఆదివారాలు సేలవు కావడంతో విరామం ఇచ్చారు అధికారులు.

Also read:

Jammu Kashmir Snow Fall: కమ్మేస్తున్న మంచు దుప్పటి.. ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..

Happy birthday Yash: అనుకున్న సమయానికే రాకీ భాయ్ ల్యాండింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Vanama Raghava: సూత్రధారి వనమా రాఘవే.. మరో వీడియోలో సంచలన విషయాలను వెల్లడించిన రామకృష్ణ..