AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir Snow Fall: కమ్మేస్తున్న మంచు దుప్పటి.. ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..

Jammu Kashmir Snow Fall: కశ్మీర్‌ అందాలు చూడాలంటే.. జనవరి మాసంలోనే చూడాలి. మంచు దుప్పటికప్పుకుని ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..

Jammu Kashmir Snow Fall: కమ్మేస్తున్న మంచు దుప్పటి.. ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..
Shiva Prajapati
|

Updated on: Jan 08, 2022 | 1:02 PM

Share

Jammu Kashmir Snow Fall: కశ్మీర్‌ అందాలు చూడాలంటే.. జనవరి మాసంలోనే చూడాలి. మంచు దుప్పటికప్పుకుని ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం.. ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా జమ్మూ కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. అయితే, శ్రీనగర్‌లో మంచుగుట్టలు భయపెడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న మంచుతో జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. ఓ వైపు మంచు వర్షం ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ… ఇక్కడి అందమైన ప్రాంతాలు మాత్రం అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రహదారి పొడవునా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఓవైపు మంచుకురుస్తుంటే.. మరోవైపు బండరాళ్లు భయపెడుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌లో ఉన్నట్టుండి రోడ్డుపై కుప్పకూలాయి బండరాళ్లు. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. జమ్ము బాన్‌ టోల్‌ప్లాజా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికి సమీపంలోని రహదారి అప్పటికే మూసేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడ్డ ఘటన సీసీటీవీలో రికార్డయింది. అటుగా వెళ్తున్న వాహనాలకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Also read:

Andhra Pradesh: పరిటాల సునితపై తోపుదుర్తి సోదరుల సంచలన కామెంట్స్.. అది నిరూపిస్తే..

Telangana: తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రోడ్లను కప్పేస్తున్న మంచు దుప్పటి

Osmania University: లీజు పేరుతో ఓయూ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. ఆ స్థలంలో ఏ నిర్మిస్తున్నారంటే..