Telangana: తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రోడ్లను కప్పేస్తున్న మంచు దుప్పటి

Temperature In Telangana: పొగ మంచుతో హైవేలు డేజంర్‌ రోడ్స్‌గా మారిపోతున్నాయి. తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న ఫాగ్‌తో ప్రమాదాలు

Telangana: తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రోడ్లను కప్పేస్తున్న మంచు దుప్పటి
Fog
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2022 | 8:02 AM

Temperature In Telangana: పొగ మంచుతో హైవేలు డేజంర్‌ రోడ్స్‌గా మారిపోతున్నాయి. తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న ఫాగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలి కూడా విపరీతంగా పెరిగిపోతోంది. తెలంగాణను చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేయడంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. వాహనదారులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణం చేసినట్లుగా.. పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు.

హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారులపై ఈ మంచు దుప్పటి విపరీతంగా కప్పేస్తుంది. ఈ పొగ మంచు చూస్తే ఈ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎలా ఉందో అర్ధమవుతోంది. అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు రక్షణ కవచాలు లేకుండా బయటికి రాని పరిస్థితి ఉందంటున్నారు. చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నామంటున్నారు స్థానికులు. ఇక ముసలి, ముతక వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. పొగమంచుతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మంచు దుప్పటితో కప్పేస్తుంది. వాహనదారులు రహదారి కానరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:

ప్రధాని పర్యటనపై కేంద్రం అతిగా స్పందిస్తోంది.. ఈ సాకుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది: పంజాబ్‌ సీఎం చరణజీత్ సింగ్

Coronavirus: కరోనా ఎఫెక్ట్‌.. సోమవారం నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం మూసివేత..

వాకింగ్ చేస్తున్నారా.. ఏ వయస్సు వారు ఎంత సేపు నడవాలో తెలుసా?
వాకింగ్ చేస్తున్నారా.. ఏ వయస్సు వారు ఎంత సేపు నడవాలో తెలుసా?
తల్లికి బర్త్ డే గిఫ్ట్‌గా ఖరీదైన కారు కొనిచ్చిన సందీప్ కిషన్
తల్లికి బర్త్ డే గిఫ్ట్‌గా ఖరీదైన కారు కొనిచ్చిన సందీప్ కిషన్
జియో కంటే మరింత తక్కువ.. 70 రోజుల వ్యాలిడిటీ.. BSNL బెస్ట్ ప్లాన్
జియో కంటే మరింత తక్కువ.. 70 రోజుల వ్యాలిడిటీ.. BSNL బెస్ట్ ప్లాన్
ఆరోగ్య పాలసీల్లో సుగర్ వ్యాధికి కవరేజీ ఉంటుందా..?
ఆరోగ్య పాలసీల్లో సుగర్ వ్యాధికి కవరేజీ ఉంటుందా..?
బరువు తగ్గుతున్న హఠాత్తుగా బరువు తగ్గుతున్న సునీతా.. నాసా ఆందోళన
బరువు తగ్గుతున్న హఠాత్తుగా బరువు తగ్గుతున్న సునీతా.. నాసా ఆందోళన
ఆమె నవ్విందంటే చాలు ప్రేమలో పడిపోవాల్సిందే
ఆమె నవ్విందంటే చాలు ప్రేమలో పడిపోవాల్సిందే
త్వరలోనే హోండా యాక్టివా ఈవీ లాంచ్.. నయా టీజర్ అదిరిందిగా..!
త్వరలోనే హోండా యాక్టివా ఈవీ లాంచ్.. నయా టీజర్ అదిరిందిగా..!
జిమ్ వెళ్లే టైమ్ లేదా? అయితే ఈ 4 వ్యాయామాలు చేస్తే అంతా సెట్!!
జిమ్ వెళ్లే టైమ్ లేదా? అయితే ఈ 4 వ్యాయామాలు చేస్తే అంతా సెట్!!
సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే..
సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే..
ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంపు
ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంపు