Vijayawada: దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

Telangana family suicide in Vijayawada: విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన

Vijayawada: దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..
Follow us

|

Updated on: Jan 08, 2022 | 11:43 AM

Telangana family suicide in Vijayawada: విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్‌కి చెందిన కుటుంబం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. అనంతరం విజయవాడలోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకోగా.. తండ్రీ కొడుకులు కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. తల్లి కొడుకు లాడ్జిలో చనిపోగా.. మరో కొడుకు తండ్రి నదిలో దూకారు. మృతులు పప్పుల శ్రీలత, పప్పుల ఆశిష్‌, పప్పుల సురేష్‌, అఖిల్‌గా పేర్కొన్నారు. మృతులు నిజామాబాద్‌ వాసులుగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫెస్ 2 కి చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు కారణం ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు అని పేర్కొంటున్నారు. లోన్ కట్టలేదని వారి ఇంటిని సంస్థ ప్రతినిధులు సీజ్ చేశారు. ఆరు నెలలుగా ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థతోపాటు పలువురి నుంచి ఈ కుటుంబానికి వేధింపులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం సురేష్ కొడుకు అఖిల్ నడిపిస్తున్న పెట్రోల్ బంక్ లో కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సురేష్ కుటుంబం విజయవాడ వెళ్లాక ప్రవేట్ ఫైనాన్స్ సంస్థ ఇంటిని సీజ్ చేసింది. ఒకేసారి ప్రైవేట్ ఫైనాన్సర్ లు, అప్పుల వాళ్ళు వేధించడంతో.. అవమానం భరించలేక సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

సురేష్ కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. చాలమంది ఫైనాన్షియర్లు ఇంటికి వచ్చే వారని తెలిపారు.

Also Read:

Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Karnataka: పెళ్లి రోజు భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు.. పోలీసులకు ఆరా తీయగా ఊహించని షాక్.!

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్