Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోని

Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Omicron
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2022 | 10:02 AM

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 128, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. నిన్నటితో పోల్చుకుంటే.. కొత్తగా 64 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఢిల్లీలో నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారి నుంచి 1203 మంది కోలుకున్నట్లు తెలిపింది. అయితే.. రానున్న కాలంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తోంది.

కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువయ్యారు. ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,72,169 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,12,740 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

India Coronavirus: తగ్గేదెలే.. దేశంలో కరోనా విలయతాండవం.. లక్షన్నరకు చేరువలో కేసులు..

Terror Attack: నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడి.. రెడ్ ఎలర్ట్!