Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: తగ్గేదెలే.. దేశంలో కరోనా విలయతాండవం.. లక్షన్నరకు చేరువలో కేసులు..

India Covid-19 Updates: కేవలం ఎనిమిది రోజుల్లోనే కరోనా మహమ్మారి ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత

India Coronavirus: తగ్గేదెలే.. దేశంలో కరోనా విలయతాండవం.. లక్షన్నరకు చేరువలో కేసులు..
India Corona Cases
Follow us
Shaik Madar Saheb

| Edited By: Subhash Goud

Updated on: Jan 08, 2022 | 10:31 AM

India Covid-19 Updates: కేవలం ఎనిమిది రోజుల్లోనే కరోనా మహమ్మారి ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు మళ్లీ లక్ష మార్క్‌ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువయ్యారు. ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 4,72,169 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,12,740 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. డైలీ పాజిటివిటి రేటు అమాంతం 9.28 శాతానికి పెరిగింది. కాగా.. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ మరో మైలురాయికి చేరింది. 150 కోట్ల డోసుల టీకాలందించారు. ఇక ఇవాల్టి నుంచి ప్రికాషనరీ డోసుకు రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభంకానున్నాయి. జనవరి 10నుంచి ప్రికాషనరీ డోస్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా 60ఏళ్లకు పైబడిన వారికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ ప్రికాషనరీ డోసు అందిస్తారు.

నిన్నటికంటే ఇవాళ 21శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు 9.28శాతానికి చేరింది. అయితే ఫిబ్రవరిలో రోజువారీ కేసులు 5 లక్షలకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 17వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేటు 17.73శాతంగా ఉంది.

Also Read:

Diabetis: డయాబెటిస్ ఉన్నవారు తీపి తినకుండా ఉండలేరు.. వారికి ఆ కోరిక రాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి!

Vanama Raghava: సూత్రధారి వనమా రాఘవే.. మరో వీడియోలో సంచలన విషయాలను వెల్లడించిన రామకృష్ణ..