Online Cheating: విజయనగరం జిల్లాలో బయటపడ్డ ఘరానా మోసం.. లక్షల్లో టోకరా..!
Online Cheating: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. పెరిగిపోతున్నాయి...
Online Cheating: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే కొన్ని ఆన్‌లైన్ సంస్థలు నిలువునా మోసగిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో ఓ ఆన్‌లైన్ ఘరానా మోసం బయటపడింది. సాలూరు మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కోట్లల్లో ఈ ఆన్‌లైన్ సంస్థ యాప్ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడింది. మరుపల్లిలోనే బాధితుల వద్ద రూ.30 లక్షలకుపైగా కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎన్‌సీ చైన్ అనే యాప్ ద్వారా పెట్టుబడి పెట్టి ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ కంటే నలబై రోజుల్లో రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ ఆ ఆన్‌లైన్ సంస్థ నమ్మబలికింది. రూ.20 వేలు పెట్టుబడి పెడితే నల బైరోజుల్లో రూ.65 వేలు ఇస్తామని యవతను ఆ యాప్ ఆకర్షించింది. ఇలా మొదట రెండు నెలలు కొంతమందికి లాభాలు అందించిన ఆన్ లైన్ సంస్థ అందిరిని ఆకర్షించేలా చేసింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాక యాప్‌ను మూసివేశారు నిర్వాహకులు. ఈ మోసంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వందలాది బాధితులున్నారు. ఇలా మోసపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఇలా రోజురోజుకు అమాయకులను అసరా చేసుకునే మోసగాళ్లు నిలువునా మోసగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెట్టబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని, ఏదైనా లింక్‌లు పంపుతూ దానిని క్లిక్ చేస్తే డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంటుందని ఇలా రకరకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులు మోసగాళ్లకు బలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: