Dangerous Area: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే.. ఇప్పటి వరకు వెళ్లిన వందలాది విమానాలు తిరిగి రాలేదట..!

Dangerous Area: భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు. ఇక ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన..

Dangerous Area: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే.. ఇప్పటి వరకు వెళ్లిన వందలాది విమానాలు తిరిగి రాలేదట..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2022 | 7:53 AM

Dangerous Area: భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు. ఇక ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు అవి ఏవైన ఉన్నాయంటే అందులో బెర్ముడా ట్రయాంగిల్‌ ఒకటైతే, ఏరియా 51 ప్రాంతం రెండోది. కానీ ఈ రెండింటి కంటే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉంది. పశ్చిమ అమెరికాలోని రెనో ఫ్రెస్నో, లాస్ వెగాస్ మధ్య ఉన్న నెవాడా ట్రయాంగిల్‌. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రదేశం వైపున వెళ్లిన విమానం ఇప్పటి వరకు తిరిగి రాలేదు.

గత 60 సంవత్సరాలలో 2 వేలకు పైగా విమానాలు ఇక్కడ క్రాష్ అయ్యాయి. వందలాది పైలట్లు ఇప్పటికి తిరిగి రాలేదు. ఈ ప్రాంతంలో ఒక శక్తి ఉందని నమ్ముతారు. ఈ ప్రాంతంపై నుంచి వెళ్తున్న విమానాలను ఓ గుర్తుతెలియని శక్తి తన వైపుకు లాగుతుందని చెబుతున్నారు సైంటిస్టులు. గ్రహాంతరవాసులు కూడా చాలాసార్లు ఇక్కడ ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ఉండే మర్మమైన శక్తి ఈ ప్రమాదాలకు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విమాన ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గ్రహాంతరవాసుల ఉనికి గురించి ప్రజలు విశ్వసించడానికి ఈ సంఘటనలే కారణం. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందని అందుకే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రమాదాలు ఈ ప్రాంతంలో గాలి పీడనం వల్ల జరుగుతున్నాయని మరికొంతమంది సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. విమానాలు ఈ ప్రాంతంలో పర్వతాల మీదుగా ఎగురుతున్న సమయంలో గాలి పీడనం అర్థంకాక విమానాలు కుప్పకూలుతున్నాయని వెల్లడించారు. అయితే శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా.. శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

Law of Gravity: మన మీద భూమ్యాకర్షణే కాదు.. సూర్య..చంద్రుల గురుత్వాకర్షణ ప్రభావమూ ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు

Stress Monitoring: చెమట ద్వారా ఒత్తిడిని గుర్తించి సమాచారం అందించే సరికొత్త వాచ్‌.. ఇది ఎలా పని చేస్తుంది..?