Viral Video: ఈ పక్షులు గూళ్లు చెట్టుపై పెట్టవు.. మరెక్కడ పెడుతుందో మీరూ చూడండి..
Viral Video: ఇది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ భారీ సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు ఇసుకతో గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టాయి. ఫ్లెమింగోలు చాలా పెద్ద కొంగలు..
Viral Video: ఇది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ భారీ సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు ఇసుకతో గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టాయి. ఫ్లెమింగోలు చాలా పెద్ద కొంగలు.. అవి చెట్లపై గూళ్లు కట్టవు. ఈ గూళ్లను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ఆ గూళ్లు చూడటానికి చీమల పుట్టల్లా ఉన్నాయి. ప్రతి గూడుపైనా ఓ గుడ్డు ఉంది. ఆ గూళ్ల పైనుంచి డ్రోన్ ముందుకుసాగింది. ఆ ఫుటేజ్ చూడటానికి చాలా కొత్తగా, వింతగా, ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే అది వైరల్ అవుతోంది.
జర్నలిస్ట్ జనక్ దేవ్.. ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దీన్ని 23 వేల మందికి పైగా చూశారు. ‘‘చలికాలంలో వేల పక్షులు ఇక్కడికి వస్తాయి. గుడ్లు పెడతాయి. ఆ సమయంలో తీసే ఫొటోలు బాగుంటాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని గుడ్కర్ నేషనల్ పార్క్ అంటారు.’’ అని ట్వీట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. అహ్మదాబాద్‌కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాన్ ఆఫ్ కచ్ టూరిజం పరంగా ప్రపంచ గుర్తింపు పొందింది. అక్కడి ఉప్పుతో కూడిన చిత్తడి నేల తెల్లగా మెరుస్తూ ఉంటుంది. తెల్లని ఎడారిలా కనిపిస్తుంది. రాత్రివేళ వెండి చందమామలా మెరుస్తుంది.
Viral Video:
कच्छ के छोटे रण से खुबसूरत तस्वीरें आई है।
ठण्ड के इस मौसम में विदेशो से हजारो पक्षी इस इलाके में आते है।
सुर्खाब,फ्लेमिंगो ने अंडे दिए है उसकी तस्वीरे दिलचस्प है।
दरअसल पूरा इलाका घुडखर अभ्यारण के तौर पर जाना जाता है।@ParveenKaswan @GujForestDept @ronakdgajjar @Kaushikdd pic.twitter.com/FV3SiQO95w
— Janak Dave (@dave_janak) January 3, 2022
Also read:
Amaravati Corporation: అమరావతి కార్పోరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. వ్యతిరేకిస్తున్న ప్రజలు..
Jammu Kashmir Snow Fall: కమ్మేస్తున్న మంచు దుప్పటి.. ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..
Andhra Pradesh: పరిటాల సునితపై తోపుదుర్తి సోదరుల సంచలన కామెంట్స్.. అది నిరూపిస్తే..