Chanakya Niti: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం రాబోతున్నట్లే..!
Chanakya Niti: కుడి కన్ను అదరితే ఏదో కీడు జరుగుతుందని, నల్ల పిల్లి ఎదురైతే చెడు జరుగుతుందని, దేవుడి ముందు వెలింగించిన దీపం ఉన్నపళంగా ఆరిపోతే అశుభం జరుగుతుందని
Chanakya Niti: కుడి కన్ను అదరితే ఏదో కీడు జరుగుతుందని, నల్ల పిల్లి ఎదురైతే చెడు జరుగుతుందని, దేవుడి ముందు వెలింగించిన దీపం ఉన్నపళంగా ఆరిపోతే అశుభం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఇలా ఒక్కో సంకేతాన్ని ఒక్కోదానికి ఆపాదించుకుంటున్నారు. ఈ విశ్వాసాలన్నీ అనాదిగా వస్తున్నాయి. వీటిని కొంత మంది నమ్ముతారు, మరికొందరు నమ్మరు. అది వేరే విషయం అనుకోండి. అయితే, రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టేందుకు సంబంధించిన పలు కీలక సూచనలను ఆచార్య చాణక్యుడు తన గ్రంధాలలో చెప్పాడు. ఆ సంకేతాలు మీకు గనుక కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలని సూచించాడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఇంట్లో తులసి చెట్టు ఆకస్మికంగా ఎండిపోవడం ఆర్థిక సంక్షోభానికి సంకేతం. అందుకే మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఒకవేళ ఎండిపోతున్నట్లయితే వెంటనే దానిపై దృష్టిసారించాలి. 2. ఎటువంటి కారణం లేకుండా అద్దం పగిలిపోతే కూడా ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పేర్కొన్నారు. అందుకే పగిలిపోయిన అద్దాన్ని, గాజును ఇంట్లో అస్సలు ఉంచొద్దు. వెంటనే దాన్ని పాడేయాలి. 3. ఇంట్లో తరచుగా ఘర్షణలు పడొద్దు. నిత్యం కోపంతో ఉండే వారి ఇంట్లో లక్ష్మీ దేవి అస్సలు నివసించదు. అలాంటి ఇంట్లో డబ్బు కొరత ఎప్పుడూ ఉంటుంది. 4. పెద్దలను అవమానించే ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పుడూ ఉండదు. వృద్ధులను అవమానించడం వలన మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభం అవుతుంది. ఇది భవిష్యత్‌లో రాబోయే సమస్యలకు సంకేతంగా పరిగణించాలి. 5. పూజలు చేయని ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. అలాంటి చోట దేవుడు కొలువై ఉండడు. పేదరిక ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది.
Also read:
5 States Elections 2022: యూపీ సహా 5 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. మీడియా ముందుకు ఈసీ..
Baby care: పిల్లలకు తరచూ జలుబు అవుతోంది.. ఉపశమనం కోసం 5 హోమ్ రెమిడీస్..