5 States Elections 2022: యూపీ సహా 5 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. మీడియా ముందుకు ఈసీ..
Elections Commission Of India: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మరి కాసేపట్లో మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం తరువాత దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.
Elections Commission Of India: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మరి కాసేపట్లో మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం తరువాత దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దాంతో ఎన్నికల నిర్వహణపై దేశంలో ప్రధాన పార్టీలతో ఎన్నికల సంఘం గతవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేశాయి. దాంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి వివరాలను మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70, గోవా 40, మణిపూర్ 60, పంజాబ్ 117 అసెంబ్లీ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని, అధిక అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీలో మాత్రం పలు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
Also read:
Viral Video: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న శనక్కాయల వ్యాపారి పాట.. అదేంటో మీరే చూసేయండి..
Constable Food: కానిస్టేబులా మజాకా!.. ఆయన తిన్న పూరీల సంఖ్య తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!