Baby care: పిల్లలకు తరచూ జలుబు అవుతోంది.. ఉపశమనం కోసం 5 హోమ్ రెమిడీస్..

Baby care: చలికాలంలో, వర్షా కాలంలో చిన్న పిల్లలు తరచుగా జబ్బుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలను జలుబు సమస్య వేధిస్తుంటుంది. సాధారణ రోజుల్లో అయితే జలుబు,

Baby care: పిల్లలకు తరచూ జలుబు అవుతోంది.. ఉపశమనం కోసం 5 హోమ్ రెమిడీస్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 08, 2022 | 12:08 PM

Baby care: చలికాలంలో, వర్షా కాలంలో చిన్న పిల్లలు తరచుగా జబ్బుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలను జలుబు సమస్య వేధిస్తుంటుంది. సాధారణ రోజుల్లో అయితే జలుబు, దగ్గు సమస్యను పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రస్తుత కరోనా కాలంలో తుమ్మినా, దగ్గినా, ముక్కు కారుతున్నా భయపడాల్సిన పరిస్థితి ఉంది. జలుబు, దగ్గు సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే, సాధారణ జలుబు, దగ్గు అయితే ఇంట్లోనే 5 చిట్కాలు ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. పిల్లలు జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. 5 వంటింటి చిట్కాలను పాటిస్తే నయం అవుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డీహైడ్రేట్‌ కాకుండా.. పిల్లలకు జలుబు, దగ్గు బారిన పడినట్లయితే.. వారి శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. డీహేడ్రేషన్ వల్ల వారు డయేరియా బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వారి శరీరానికి సరిపడ లక్విడ్ పదార్థాలను తినిపించాలి. వైద్యుల సూచన మేరకు పిల్లలకు ఫుడ్ అందించాలి.

గోరు వెచ్చని నీటిని..  పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నట్లయితే.. వారికి గోరు వెచ్చని నీటిని తాగించాలి. గోరు వెచ్చని నీటిని తాగించడం వల్ల ఛాతిలో ఏర్పడిన శ్లేష్మం క్లియర్ అవుతుంది. అలాగే నాసికా రంధ్రాల్లో ఏర్పడిన బ్లాక్స్ కూడా తొలగిపోతాయి. దీంతో పిల్లలకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఆవిరి పట్టించాలి.. సాధారణంగా పిల్లలకు ఆవిరి పట్టించడం కష్టమైన పని. కానీ, ఆవిరి పట్టించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. జలుబు, దగ్గు వస్తే.. వారికి ఆవిరి పట్టించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. జలుబు కారణంగా మూసుకుపోయిన నాసికా రంధ్రాలు ఆవిరి పట్టడం ద్వారా క్లియర్ అవుతాయి. శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది.

వెల్లుల్లి, నూనె మసాజ్.. ఏళ్ల నుంచి వస్తున్న ఇంటి చిట్కా ఇది. వెల్లుల్లి, ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పిల్లలకు జలుబు చేసినట్లయితే.. రాత్రి నిద్రిస్తున్నప్పుడు వారి శరీరాన్ని నూనెతో మసాజ్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలను ఆవాల నూనెలో వేడి చేసి.. అది చల్లారిన తరువాత పిల్లలకు మసాజ్ చేయాలి.

స్నానం చేయించొద్దు.. పిల్లలకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు.. వారికి స్నానం చేయించొద్దు. స్నానానికి బదులుగా గోరు వెచ్చని నీటితో ఒక టవల్ గానీ, స్పాంజీతో గానీ పిల్లల శరీరాన్ని శుభ్రం చేయాలి. గది ఉష్ణోగ్రతకు, బాత్రూమ్ ఊష్ణోగ్రతకు తేడా ఉంటుంది. అందుకే గదిలోనే పిల్లల శరీరాన్ని శుభ్రం చేయాలని నిపుణుల సూచిస్తున్నారు.

నోట్: నిపుణుల సూచనల మేరకు దీనిని పేర్కొనడం జరిగింది. అయితే పిల్లలకు జలుబు, దగ్గు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Also read:

China New Record: చైనా సరికొత్త రికార్డు.. ఏకంగా సూర్యడిని మించి శక్తిని ఉత్పత్తి చేసింది.. షాకింగ్ వివరాలివే..

Viral Video: సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్న శనక్కాయల వ్యాపారి పాట.. అదేంటో మీరే చూసేయండి..

Constable Food: కానిస్టేబులా మజాకా!.. ఆయన తిన్న పూరీల సంఖ్య తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు