Bank Of Baroda Jobs: పరీక్ష లేకుండానే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే..

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

Bank Of Baroda Jobs: పరీక్ష లేకుండానే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే..
Follow us

|

Updated on: Jan 08, 2022 | 4:57 PM

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ (58), అగ్రి బ్యాంకింగ్ (47) ఖాళీలు ఉన్నాయి.

* వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ విభాగంలో హెడ్ వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇన్వస్ట్ మెంట్ రీసెర్చ్ మేనేజర్, పోర్ట్ పోలియో రీసెర్చ్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్ సేల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అగ్రి బ్యాంకింగ్ విభాగంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీతో పాటు, రెండేళ్లు ఫుల్ టైం పీజీ చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 100, ఇతరులు రూ. 600 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 27-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: East Godavari: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..

SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

Acharya Song: వివాదంలో ఆచార్య ఐటమ్ సాంగ్.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఏపీ హోం మంత్రికి ఫిర్యాదు