Chapati: కరోనా సమయంలో వీటితో చేసిన చపాతీలు బెస్ట్.. రోగనిరోధక శక్తిపెంచడంలో సూపర్..

Chapati: సాధారణంగా గోధుమ పిండితో చేసిన చపాతీలను ఇళ్లలో తింటారు. అయితే మీకు బాగా చలిగా అనిపిస్తే ఈసారి ఈ 5 రకాల పిండితో తయారుచేసిన చపాతీలను

Chapati: కరోనా సమయంలో వీటితో చేసిన చపాతీలు బెస్ట్.. రోగనిరోధక శక్తిపెంచడంలో సూపర్..
Flour
Follow us
uppula Raju

|

Updated on: Jan 08, 2022 | 4:42 PM

Chapati: సాధారణంగా గోధుమ పిండితో చేసిన చపాతీలను ఇళ్లలో తింటారు. అయితే మీకు బాగా చలిగా అనిపిస్తే ఈసారి ఈ 5 రకాల పిండితో తయారుచేసిన చపాతీలను తినండి. ఇవి మీ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. సాధారణంగా అన్నం తింటే బరువు పెరుగుతారని చాలామంది చపాతీవైపు మొగ్గు చూపుతారు. అంతేకాదు చపాతీలు సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

1. మినపపిండి: మినపపిండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది శరీరానికి చాలా వేడినిస్తుంది. కండరాలను బలంగా చేస్తుంది. బాగా చలిగా అనిపించే వారు, కీళ్ల, వెన్నునొప్పి, ఆస్తమా సమస్యలు ఉన్నవారు చలికాలంలో మినపపిండితో చేసిన చపాతీలను తింటే మంచిది. ఇందులో పీచు పుష్కలంగా ఉండడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి.

2. రాగిపిండి: రాగి పిండిలో క్యాల్షియం, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రాగుల ప్రభావం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు. కొండ ప్రాంతాల్లో చలికాలపు ప్రభావం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఈ పిండితో చేసిన చపాతీలను తింటారు. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. రక్తహీనత నుంచి శరీరాన్ని కాపాడుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. జొన్న పిండి: జొన్న పిండిలో ప్రోటీన్, విటమిన్ బి, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని అందజేస్తుంది. ఉబ్బసం, మధుమేహం తదితర సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

4. మొక్కజొన్న పిండి: చలికాలంలో మొక్కజొన్న పిండితో చేసిన చపాతి చాలా మేలు చేస్తుంది. మొక్కజొన్న పిండిలో ఫైబర్, విటమిన్లు A, B, E, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ. శీతాకాలంలో చాలా మంది మొక్కజొన్న చపాతి తినడానికి ఇష్టపడతారు.

5. శనెగపిండి: శనెగపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో దీనిని ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ప్రొటీన్, కొవ్వు, పిండి పదార్థాలు, పీచు, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ బి2, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మీ అకౌంట్‌ బ్లాక్ అయిందని మెస్సేజ్ వచ్చిందా..?

Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?

కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త..?

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా